Homeజాతీయ వార్తలుRemove Toll Plazas: ఇక టోల్ ప్లాజాలు ఉండవు.. కేంద్రం కొత్త ప్లాన్ ఏంటి?...

Remove Toll Plazas: ఇక టోల్ ప్లాజాలు ఉండవు.. కేంద్రం కొత్త ప్లాన్ ఏంటి? డబ్బులు ఎలా కట్టాలి?

Remove Toll Plazas: దేశంలో టోల్ ప్లాజాలతో ఉన్న ఇబ్బందులు అంతా ఇంతా కావు. ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ నూతన విధానాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదివరకు ఉన్న డైరెక్టుగా డబ్బులు తీసుకునే ప్రక్రియకు టాటా చెప్పనున్నారు. నంబర్ ప్లేట్ల ఆధారంగా కారు నంబర్ ను రీడ్ చేసి వారి ఖాతాల నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించేందుకు కసరత్తులు చేస్తోంది. దీంతో ప్రజల ఇబ్బందులను కూడా లెక్కలోకి తీసుకుంటోంది. రాబోయే కాలంలో టోల్ ప్లాజాల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించాలని భావిస్తోంది.

Remove Toll Plazas
Remove Toll Plazas

టోల్ ప్లాజాలను కెమెరాలతో అమర్చుతారు. అవి డైరెక్టుగా వాహనాల నెంబర్లను రీడ్ చేసి వారి ఖాతాల నుంచి డబ్బులు కట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. నాలుగేళ్లలో రకరకాల నంబర్ ప్లేట్లు వచ్చాయి. వాటిని కెమెరాలు తీసుకునే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇంకా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. యూజర్ అకౌంట్ నుంచి డబ్బులు నేరుగా తీసుకునే పథకంలో ఇంకా కొన్ని సమస్యలున్నట్లు గుర్తిస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద డబ్బులు చెల్లించని వారికి జరిమానా విధించే నిబంధన లేకపోవడంతో ఇందులో ఎదురయ్యే ఇబ్బందులను లెక్కలోకి తీసుకుని భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.

టోల్ ప్లాజాల ద్వారా ప్రభుత్వానికి రూ. 40 వేల కోట్లు ఆదాయం రానుంది. ఇందులో 97 శాతం ఫాస్ట్ ట్యాగ్ ప్రకారం వస్తోంది. ఇక మిగిలిన మూడు శాతం మంది ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించుకున్నందుకు ఎక్కువ మొత్తం చెల్లిస్తుండటం తెలిసిందే. ఫాస్ట్ ట్యాగ్ లతో టోల్ ప్లాజా దాటడానికి మ్యానువల్ గా అయితే గంటకు 112, ఎలక్ర్టానిక్ టోల్ కలెక్షన్ ల ద్వారా అయితే గంటకు 260 వాహనాలు వెళ్లడంతో టోల్ ప్లాజాల్లో కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పిస్తోంది. 2021 నుంచి ఫాస్ట్ ట్యాగ్ లు తప్పనిసరి అయ్యాయి.

Remove Toll Plazas
Remove Toll Plazas

దీంతో టోల్ ప్లాజాలలో అవుతున్న ఆలస్యంతో వాహనాలు సమయానికి గమ్యం చేరుకోలేకపోతున్నారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం కెమెరాల ద్వారా నంబర్ ప్లేట్లను రీడ్ చేసి నేరుగా డబ్బులు తీసుకునే సదుపాయానికి రెడీ అవుతోంది. కొన్నిసార్లు ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు కూడా వేధిస్తున్నాయి. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ అండ్ ట్యాగ్, రెండోది యూజర్ ఫాస్ట్ ట్యాగ్ లను వర్తింపజేయడం.

దేశంలోని రోడ్లను మహత్తరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తోంది. ఎక్స్ ప్రెస్ రోడ్లను తయారు చేసే క్రమంలో 2024 నాటికి 26 గ్రీన్ ఎక్స్ ప్రెస్ రోడ్లుగా మలచేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధాన నగరాల మధ్య దూరం తగ్గించేందుకు తాపత్రయపడుతోంది. ఈ క్రమంలో రహదారుల విస్తరణకు కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది.

 

Liger Movie First Review || Liger Movie Twitter Review || Vijay Devarakonda || OkteluguEntertainment

 

పవన్ కళ్యాణ్ నాకు లైఫ్ ఇచ్చాడు || Sukumar Interview With Puri Jagannadh || Oktelugu Entertainment

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version