https://oktelugu.com/

ఏపీ బీజేపీలో కీలక మలుపు రాబోతోందా?

కేంద్రంలోని బీజేపీది వైసీపీకి అనుకూల స్ట్రాటజీ.. కానీ ఏపీలోని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణది మాత్రం వైసీపీ వ్యతిరేక వైఖరి. ఒకే పార్టీ రెండు ధోరణులు.. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఈ పంచాయితీ ఆసక్తి రేపుతోంది. టీడీపీ అనుకూల కన్నా లక్ష్మీనారాయణ వైఖరి చర్చనీయాంశమైంది. కేంద్రంలోని పెద్దలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటే కన్నా మాత్రం ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఇసుక పాలసీ నుంచి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వివాదం వరకు జగన్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.  తీవ్ర […]

Written By:
  • NARESH
  • , Updated On : July 5, 2020 4:02 pm
    Follow us on

     ap-bjp-oktelugu
    కేంద్రంలోని బీజేపీది వైసీపీకి అనుకూల స్ట్రాటజీ.. కానీ ఏపీలోని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణది మాత్రం వైసీపీ వ్యతిరేక వైఖరి. ఒకే పార్టీ రెండు ధోరణులు.. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఈ పంచాయితీ ఆసక్తి రేపుతోంది. టీడీపీ అనుకూల కన్నా లక్ష్మీనారాయణ వైఖరి చర్చనీయాంశమైంది.

    కేంద్రంలోని పెద్దలు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటే కన్నా మాత్రం ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఇసుక పాలసీ నుంచి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వివాదం వరకు జగన్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.  తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ కూడా రెండు వర్గాలుగా విడిపోయినట్టు కనిపిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణతోపాటు పాత బీజేపీ నేతలు, టీడీపీ సానుభూతి పరులు చంద్రబాబుకు మేలు చేసేలా జగన్ ను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక బీజేపీలోని మరో వర్గం ఎంపీ జీవీఎల్ తోపాటు రామ్ మాధవ్ లాంటి వాళ్లు జగన్ కు మేలు జరిగేలా చంద్రబాబు టార్గెట్ గా రాజకీయం చేస్తూ వస్తున్నారు. అయితే కన్నా ఎంత విమర్శలు చేసినా ఆయన్ను మాత్రం బీజేపీ అధిష్టానం పట్టించుకోలేదు. కంట్రోల్ చేయలేదు. అదే బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    కన్నా లక్ష్మీనారాయణతో ఏపీలో బీజేపీ బలపడే చాన్స్ లేదని అధిష్టానం దాదాపు నిర్ణయానికి వచ్చేసినట్టు కనిపిస్తోంది. అందుకే కన్నా.. చంద్రబాబు అనుకూల వైఖరి తీసుకున్నా ఆయన్ను పట్టించుకోవడం లేదట.. అందుకే కొద్దిరోజులుగా కన్నా సైలెంట్ అయిపోవడం బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

    దీనికి కారణం ఏంటంటే కన్నా ప్లేసులో ఏపీ బీజేపీకి దమ్మున్న కొత్తనేతను బీజేపీ చీఫ్ గా చేయడానికి అధిష్టానం రెడీ అయిపోయిందట.. కన్నా లక్ష్మీనారాయణ పదవీకాలం అయిపోయి నెలరోజులు కావస్తోంది. దీంతో ఆయనను మరోసారి కొనసాగించే అవకాశాలు లేవని బీజేపీ అధిష్టానం నుంచి వార్తలు వస్తున్నాయి.

    తనకు రెండోసారి అవకాశం ఇస్తారని కన్నా అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త చీఫ్ కోసం బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారని వార్తలు రావడంతోనే కన్నా మౌనం దాల్చారట.. ఇలా బీజేపీకి కొత్త చీఫ్ రావడానికి కన్నా స్వయంకృతాపరాధమే కారణమన్న వాదన వినిపిస్తోంది.