అక్కడ వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇలా..?

నేడు రాజకీయ నాయకుల చూపంతా ఆంధ్రప్రదేశ్ లో వివిధ కారణాలతో నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల వైపే పడింది. ఇందులో నెల్లూరు కార్పొరేషన్ తో సహా 13 మున్సిపాలిటీలకు సంబంధించి ఫలితాల కౌంటింగ్ దాదాపు పూర్తయింది. ఈ ఫలితాల్లో 10 మున్సిపాలిటీలను అధికార పార్టీ వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అధినేత ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీతో సహా ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైసీపీ విజయ ఢంకా మోగించింది. ప్రకాశం […]

Written By: Navya, Updated On : November 17, 2021 8:25 pm
Follow us on

నేడు రాజకీయ నాయకుల చూపంతా ఆంధ్రప్రదేశ్ లో వివిధ కారణాలతో నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల వైపే పడింది. ఇందులో నెల్లూరు కార్పొరేషన్ తో సహా 13 మున్సిపాలిటీలకు సంబంధించి ఫలితాల కౌంటింగ్ దాదాపు పూర్తయింది. ఈ ఫలితాల్లో 10 మున్సిపాలిటీలను అధికార పార్టీ వైసీపీ కైవసం చేసుకుంది.

టీడీపీ అధినేత ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీతో సహా ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైసీపీ విజయ ఢంకా మోగించింది. ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రం టీడీపీ గెలుపొందింది. ఇదిలా ఉండగా కృష్టా జిల్లాలో మాత్రం వైసీపీకి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.

అక్కడ కొండపల్లి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలో మొత్తం వార్డులు 29 ఉండగా.. చెరో 14 వార్డులను సాధించాయి. ఒకరు ఇండిపెండెంట్ కరిమికొండ శ్రీలక్ష్మి అనే అభ్యర్థి గెలిచారు. ఈ మున్సిపాలిటీ కూడా వైసీపీ కైవసం చేసుకోవాలి.. కానీ టీడీపీ అక్కడ అదును చూసి దెబ్బ కొట్టిందనే చెప్పాలి. అధికార వైసీపీకి ధీటుగా సమాధానం చెప్పేందుకు ఒక ఇద్దరు టీడీపీ కీలక నేతలను రంగంలోకి దించినట్లు తెలిసింది.

కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు అధికార వైసీపీకి అత్యంత కీలకమైనప్పటికీ ప్రజల్లోకి వెళ్ళడంలో పూర్తిగా విఫలం అయినట్లు కనిపిస్తోంది. ఇక తాజా ఫలితాల్లో జగ్గయ్యపేట మున్సిపాలిటీ కూడా వైసీపీ కైవసం చేసుకుంది. దీనిలో 31 వార్డులో 17 వార్డులు వైసీపీ గెలుపొందగా.. 14 వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది. మొత్తం 10 మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. ఒకటి టీడీపీ.. మరొకటి తేలాల్సి ఉంది. నెల్లూరు కార్పొరేషన్ కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా.. కొండపల్లిలోని స్వతంత్ర్య అభ్యర్థి చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరినట్లు సమాచారం.