https://oktelugu.com/

మూడు రాజధానులపై తేల్చేసిన కేంద్రం

ఏపీలోని మూడు రాజధానుల ప్రక్రియపై కేంద్రం అధికారికంగా స్పష్టతనిచ్చింది. తాజాగా ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటివరకూ రాజధాని రైతులు ఏపీ విభజన చట్టంలో మూడు రాజధానుల ప్రస్తావనే లేదని వాదిస్తున్న నేపథ్యంలో దీనిపై మరింత స్ఫష్టత ఇచ్చింది. విభజన చట్టాన్ని అర్ధం చేసుకోవడంలో పిటిషనర్లు అయిన రైతులు అపోహ పడుతున్నట్లు కేంద్రం తెలిపింది. అదే సమంయలో హైకోర్టు రాజధానిలోనే ఉండాలని చేస్తున్న వాదనలోనూ అర్ధం లేదని తెలిపింది. Also Read: ఏపీలో రంగులపై […]

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2020 1:13 pm
    Follow us on

    ఏపీలోని మూడు రాజధానుల ప్రక్రియపై కేంద్రం అధికారికంగా స్పష్టతనిచ్చింది. తాజాగా ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటివరకూ రాజధాని రైతులు ఏపీ విభజన చట్టంలో మూడు రాజధానుల ప్రస్తావనే లేదని వాదిస్తున్న నేపథ్యంలో దీనిపై మరింత స్ఫష్టత ఇచ్చింది. విభజన చట్టాన్ని అర్ధం చేసుకోవడంలో పిటిషనర్లు అయిన రైతులు అపోహ పడుతున్నట్లు కేంద్రం తెలిపింది. అదే సమంయలో హైకోర్టు రాజధానిలోనే ఉండాలని చేస్తున్న వాదనలోనూ అర్ధం లేదని తెలిపింది.

    Also Read: ఏపీలో రంగులపై ఉన్న సోయి.. పింఛన్లపై లేదా..?

    ఏపీలో మూడు రాజదానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న ధర్మాసనం ముందు కేంద్రం ఇవాళ మరో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ అదనపు అఫిడవిట్లో ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టంగా చెప్పింది. ఏపీలో రాజధాని లేదా రాజధానుల ఏర్పాటులో కేంద్రం ప్రమేయం ఉండబోదని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న రాజధానికి ఆర్ధిక, ఇతర సాయాలు చేయడం మాత్రమే తమ పరిధి అని స్పష్టం చేసింది. తద్వారా ఏపీలో రాజధాని ఏర్పాటులో కేంద్రం పాత్రేమీ ఉండబోదని మరోసారి చెప్పినట్లయింది.

    ఏపీకి మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానుల్లో కేంద్రం పాత్రపై హోంశాఖ మరింత స్పష్టత ఇచ్చింది. హైకోర్టు ఉంది కాబట్టి అమరావతే రాజధాని అనుకోవడానికి లేదని కూడా కేంద్రం ఈ అఫిడవిట్లో క్లారిటీ ఇచ్చింది. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హైకోర్టు రాజధానిలో ఉండాలని ఎక్కడా లేదని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. హైకోర్టు మార్పు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయాధికారం అని కేంద్రం చెప్పినట్లైంది.

    Also Read: దౌర్భాగ్యం: ఈ నేరచరితులే మన పాలకులా?

    రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని హైకోర్టుకు కేంద్రం తెలిపింది. రాజధానికి ఆర్థిక సాయం మాత్రమే చేస్తామని చెప్పింది. చట్టంలో రాజధాని ఎంపిక అని మాత్రమే ఉందని.. ఒకే రాజధాని అని మాత్రం కాదని కేంద్రం చెప్పింది. ఒకటి కంటే ఎక్కువ రాజధానులు ఉంటే సాయం చేయబోమని తామెక్కడా చెప్పలేదని కేంద్రం తాజా అఫిడవిట్లో పేర్కొంది. దీంతో మూడు రాజధానులకు కేంద్రం అమోదముద్ర వేసినట్టేనని తెలుస్తోంది.