https://oktelugu.com/

పాపం నిర్మాతలు.. తగ్గనంటున్న క్రియేటివ్ డైరెక్టర్ !

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి ఓ ప్రధాన సమస్య ఉంది. ప్రొడ్యూసర్స్ బాధను ఆయన అర్ధం చేసుకోరు అట. ఎంత బడ్జెట్ అవుతుంది.. మళ్లీ ఎంత రిటర్న్ వస్తోంది లాంటి లెక్కల విషయంలో ఈ లెక్కల మాస్టర్ లెక్కలు నిర్మాతలకు చివరకు చుక్కుల చూపిస్తాయట. అందుకే కొంతమంది చాటుగా సుకుమార్ ని ఈయనేదో సినిమా హిట్ సూత్రాన్ని కనిపెట్టినట్లు ఫీల్ అవుతుంటాడు అని విమర్శిస్తుంటారు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా.. సుకుమార్ అంటే స్టార్ హీరోలకు ఓ […]

Written By:
  • admin
  • , Updated On : September 10, 2020 / 12:24 PM IST
    Follow us on


    క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి ఓ ప్రధాన సమస్య ఉంది. ప్రొడ్యూసర్స్ బాధను ఆయన అర్ధం చేసుకోరు అట. ఎంత బడ్జెట్ అవుతుంది.. మళ్లీ ఎంత రిటర్న్ వస్తోంది లాంటి లెక్కల విషయంలో ఈ లెక్కల మాస్టర్ లెక్కలు నిర్మాతలకు చివరకు చుక్కుల చూపిస్తాయట. అందుకే కొంతమంది చాటుగా సుకుమార్ ని ఈయనేదో సినిమా హిట్ సూత్రాన్ని కనిపెట్టినట్లు ఫీల్ అవుతుంటాడు అని విమర్శిస్తుంటారు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా.. సుకుమార్ అంటే స్టార్ హీరోలకు ఓ నమ్మకం. గొప్ప టాలెంటెడ్ డైరెక్టర్ అనే ఓ గొప్ప భరోసా. అందుకే ప్రస్తుతం స్టార్స్ అందరూ సుకుమార్ తో సినిమా అనగానే వెంటనే ఒప్పేసుకుంటున్నారు. సుక్కు ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. నిజానికి వీరి కలయికలో సినిమా వస్తోందంటేనే.. అంచనాలు రెట్టింపు ఆవుతాయి.

    Also Read: పవన్ కళ్యాణ్ టాలీవుడ్ సక్సెస్ దానిమీదే ఆశ

    కాగా అక్టోబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో షూటింగ్ పూర్తి చేయాలని మొన్నటివరకూ ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు షూటింగ్ ను పోస్ట్ ఫోన్ చేస్తున్నారట. కారణం సినిమా బడ్జెట్ విషయంలో చిన్న తేడా వచ్చిందని. ఈ కరోనా కాలంలో ఓవర్ బడ్జెట్ పెట్టి సినిమా తీయలేం అని నిర్మాతలు సుకుమార్ తో అన్నట్లు.. బడ్జెట్ తగ్గిస్తే నేను సినిమా చేయను అని సుకుమార్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నిర్మాతలు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదట. ఇప్పుడు ఓవర్ బడ్జెట్ చేస్తే.. రేపు బడ్జెట్ ఎక్కువై సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోతే మా పరిస్థితి ఏమిటి. ఆసులకే ఇది కరోనా కాలం. రెగ్యులర్ డేస్ లో కంటే.. ప్రస్తుతం షూటింగ్ చేయడం బాగా ఖర్చుతో కూడుకున్న పని. సుకుమార్ ఈ విషయం గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాడో.. మాకు అర్ధం కావడం లేదు అని నిర్మాతలు తమ బాధను బన్నీ దగ్గర మొరపెట్టుకున్నారట.

    Also Read: అఖిల్ మీద 70 కోట్లు అంటే.. కష్టమే !

    ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో సుకుమార్ ఇగోకి పోకుండా బడ్జెట్ తగ్గించే ఆలోచన చేస్తే బాగుంటుందని బన్నీ కూడా ఫీల్ అవుతున్నాడట. కానీ బన్నీకి పాన్ ఇండియా సినిమా కావాలి. ఆ రేంజ్ లో సినిమా ఉండాలి అంటే.. కచ్చితంగా బడ్జెట్ పరిమితులు ఉండకూడదు. పైగా తనకు ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ కావాలి, ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ ను ఎట్టిపరిస్థితుల్లో తమ సినిమాలో తీసుకోవాలనేది బన్నీ కండీషన్. అందుకే సుక్కు కూడా బడ్జెట్ తగ్గితే బాలీవుడ్ స్టార్స్ సినిమాలో పెట్టుకునే అవకాశం ఉండదని బన్నీని తన వైపుకు తిప్పుకున్నాడు. ఇప్పుడు కేవలం బాలీవుడ్ స్టార్స్ కోసమే అదనంగా మరో పది కోట్ల రూపాయలను బడ్జెట్ పెంచాలని నిర్మాతలకు సుకుమార్ తేల్చి చెప్పాడట. పాపం నిర్మాతలు.