అప్పట్లో స్పానిష్ ఫ్లూ.. నేడు కరోనా.. ఏం చెబుతున్నాయి?

కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడా చూసిన ఈ మాయదారి రోగం గురించే చర్చ. టీవీల్లో, పేపర్లలో, సోషల్ మీడియాలో ఎక్కడి చూసిన కరోనా వార్తలే.. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు సోకింది. కరోనా పేరుచెబితేనే అగ్రరాజ్యాలు సైతం ఉలికిపడిపోతున్నాయి. అమెరికా, ఇటలీ, బ్రిటన్, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కోటికి చేరువలో ఉన్నాయి. ఒకట్రెండు రోజుల్లో కోటిని దాటేసిన […]

Written By: Neelambaram, Updated On : June 24, 2020 4:28 pm
Follow us on


కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడా చూసిన ఈ మాయదారి రోగం గురించే చర్చ. టీవీల్లో, పేపర్లలో, సోషల్ మీడియాలో ఎక్కడి చూసిన కరోనా వార్తలే.. చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు సోకింది. కరోనా పేరుచెబితేనే అగ్రరాజ్యాలు సైతం ఉలికిపడిపోతున్నాయి. అమెరికా, ఇటలీ, బ్రిటన్, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కోటికి చేరువలో ఉన్నాయి. ఒకట్రెండు రోజుల్లో కోటిని దాటేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఎంపీకి షోకాజ్ నోటీసు ఇచ్చిన వైసీపీ..!

ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కంటే ముందే ఇలాంటి వైరస్ ప్రపంచానికి సవాల్ విసిరింది. దానిపేరు స్పానిష్ వైరస్. ఇది తొలుత స్పెయిన్లో రావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. కరోనా వైరస్ మాదిరిగానే ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సోకలేదు. మానవుడి వ్యక్తిగత అపరిశుభ్రతే ఈ వైరస్ పుట్టుక కారణం. 1918లో తొలిసారి ఈ వైరస్ ను గుర్తించారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఓ సైనికుడికి ప్లూ లక్షణాలు వచ్చాయి. అతడి నుంచి సైనికులందరికీ ఈ వైరస్ వచ్చింది. ఆ తర్వాత యూరప్ దేశాలకు అక్కడి నుంచి ఇండియాకు పాకింది స్పానిష్ వైరస్.

చైనాతో ఫైట్.. మోడీనే సరైనోడా?

భారత్లోకి కరోనా వైరస్ ఎలా ఎంట్రీ ఇచ్చిందో అదేమాదిరిగా స్పానిష్ వైరస్ కూడా అప్పట్లో వచ్చింది. యూరప్ కు చెందిన నౌకా సిబ్బంది నుంచి బాంబే పోర్టులో పని చేసే ఉద్యోగికి స్పానిష్ వైరస్ సోకింది. అంటే విదేశీయులను ఈ వైరస్ దిగుమతి అయిందన్నమాట. సదరు ఉద్యోగి నుంచి ఒక్కొక్కరిగా బాంబే అంతటా వ్యాపించింది. క్రమంగా దేశమంతా ఈ వైరస్ సోకింది. ప్రజలకు ఈ వైరస్ అవగాహన లేకపోవడంతో దాదాపు 2కోట్ల మంది వైరస్ బారినపడి మృతిచెందినట్లు సమాచారం. అప్పట్లో మృతదేహాలను కాల్చేందుకు కూడా కట్టెలు దొరకని పరిస్థితి ఏర్పడిదంటే ఈ వైరస్ ఎంతలా విజృంభించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

స్పానిష్ వైరస్ ను యూరప్, అమెరికా దేశాలు సామాజిక దూరం పాటించడం కట్టడి చేయగలిగాయి. ప్రసార మాధ్యమాల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించారు. అప్పట్లోనే ప్రజలు మాస్కులు ధరించడం.. సబ్బుుతో చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. భారత్లో అప్పటివరకు సామాజిక దూరంపై అవగాహన లేకపోవడంతో ఈ వైరస్ దేశమంతా విజృంభించింది. ప్రజలు పెద్దఎత్తున మృత్యువాత పడుతుండటంతో పాలకులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆస్పతుల్లో సదుపాయాలు కల్పించడం వంటి చర్యలు చేపట్టారు. ఆ తర్వాత దీనికి మందురావడంతో ఈ వైరస్ ను కట్టడి చేయగలిగారు.

భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?

దాదాపు రెండేళ్లపాటు ప్రపంచంపై ప్రభావం చూపింది. నాటి స్పానిష్ వైరస్ తో పొలిస్తే ఇప్పుడున్న కరోనా అంత ప్రభావమైనది కాదని నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ ను ఒకరి నుంచి మరొకరికి సోకకుండా బ్రేక్ చేస్తే దీనిని నివారించడం సులభమని అంటున్నారు. మనమంతా మన ఇళ్లల్లో 15రోజులపాటు ఉంటే కరోనా నివారించవచ్చని అంటున్నారు. అలా కాకుండా ఇష్టానుసారంగా బయట తిరిగితే కరోనాను కట్టడి చేయలేమని అంటున్నారు.

స్పానిష్ ప్లూ మాదిరిగానే కరోనాను కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సామాజిక దూరం పాటించడం.. వ్యక్తిగత శుభ్రత పాటించడం.. మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం.. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం చేస్తే ఈ మహమ్మరిని కట్టడి చేయచ్చని వైద్యులు సూచిస్తున్నారు. స్పానిష్ ప్లూతో పొల్చుకుంటే ఇప్పుడొచ్చిన కరోనా వైరస్ అంత డేంజర్ కాదని నిపుణులు అంటున్నారు.