AP Theaters: థియేటర్ల నిండా కన్నీళ్ల మయం.. ఏపీ అంతా అయోమయం !

AP Theaters: ఏపీలో థియేటర్ల పరిస్థితి కారణంగా ఏ సినిమా ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి లోకి వెళ్లిపోయింది తెలుగు సినిమా పరిస్థితి. ఒక కొత్త సినిమా విడుదల అవుతుందని ఎనౌన్స్ చేయగానే.. ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామో అంటూ నిర్మాతలకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇక సినిమా మరో పది రోజుల్లో రిలీజ్ కాబోతుంది అంటే.. తమ సినిమా ఏ ఏ థియటర్స్ లో రిలీజ్ అవుతుందో కూడా ఒక లిస్ట్ […]

Written By: Shiva, Updated On : December 28, 2021 3:39 pm
Follow us on

AP Theaters: ఏపీలో థియేటర్ల పరిస్థితి కారణంగా ఏ సినిమా ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి లోకి వెళ్లిపోయింది తెలుగు సినిమా పరిస్థితి. ఒక కొత్త సినిమా విడుదల అవుతుందని ఎనౌన్స్ చేయగానే.. ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామో అంటూ నిర్మాతలకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇక సినిమా మరో పది రోజుల్లో రిలీజ్ కాబోతుంది అంటే.. తమ సినిమా ఏ ఏ థియటర్స్ లో రిలీజ్ అవుతుందో కూడా ఒక లిస్ట్ ఉంటుంది.

AP Theaters

దాంతో తమ సినిమా ఎన్ని థియేటర్లలో.. ఏ ఏ థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నారో చాలా క్లారిటీగా రాసేవారు. ఇప్పుడు ఏమి రాయాలో కూడా మేకర్స్ కి తెలియడం లేదు. అసలు రేపు రిలీజ్ అయ్యే సినిమాకి కేటాయించిన థియేటర్ కూడా రాత్రికి రాత్రే మూతపడిపోతుంది. దాంతో అసలు రోజుకు ఎన్ని థియేటర్లు మూతబడుతున్నాయో కూడా అర్థం కావడం లేదు.

కారణం.. జగన్ ప్రభుత్వం సినిమా టికెట్‌ కు నిర్ణయించిన ధరలు చూసి థియేటర్ల యజమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అడ్డగోలుగా సినిమా టికెట్‌ రేట్లు పెంచకుండా నియంత్రిస్తున్నాం అని చెబుతూ.. జగన్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోతూ థియేటర్స్ రూపురేఖలనే మార్చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏపీ ప్రభుత్వం ప్రాంతాల వారీగా థియేటర్లను విభజించి రేట్లు ఏ విధంగా నిర్ణయించిందో చూద్దాం.

మున్సిపల్ కార్పొరేషన్లలోని థియేటర్స్ లో టికెట్ రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.250 ఉంది, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75 ఉన్నాయి

ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100 ఉంది, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40 ఉన్నాయి

నాన్ ఏసీ- ప్రీమియం రూ.60 ఉంది, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20 ఉన్నాయి.

మున్సిపాలిటీలోని థియేటర్స్ లో టికెట్ రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150 ఉంది, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60 ఉన్నాయి.

ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70 ఉంది, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30 ఉన్నాయి.

నాన్ ఏసీ- ప్రీమియం రూ.50 ఉంది, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15 ఉన్నాయి

నగర పంచాయతీ లోని థియేటర్స్ లో టికెట్ రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120 ఉంది, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40 ఉన్నాయి.

ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35 ఉంది, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15 ఉన్నాయి.

నాన్ ఏసీ- ప్రీమియం రూ.25 ఉంది, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10 ఉన్నాయి.

Also Read: సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా?

గ్రామ పంచాయతీల్లోని థియేటర్స్ లో టికెట్ రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

మల్టీప్లెక్స్-ప్రీమియం రూ.80 ఉంది, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30 ఉన్నాయి.

ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20 ఉంది, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10 ఉన్నాయి.

నాన్ ఏసీ- ప్రీమియం రూ.15 ఉంది, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5గా ఉన్నాయి.

నిజంగానే పై ధరలను చూస్తే… థియేటర్ల నిర్వహణ కష్టమని చిన్నపిల్లలు కూడా చెబుతారు. మరి, ఈ థియేటర్ల నిండా కన్నీళ్ల మయం అని జగన్ కి ఎందుకు అర్థం కావడం లేదో !!

Also Read: లేస్తున్న గొంతులు.. సీఎం జగన్ పై టాలీవుడ్ తిరుగుబాటు మొదలైందా?

Tags