https://oktelugu.com/

SS Rajamouli: ‘దర్శకులందు రాజమౌళి లెస్స’.. జక్కన్న పై ప్రశంసల వర్షం

SS Rajamouli: కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇప్పుడు ఇతర భాషల సినీ ప్రముఖులంతా ‘దర్శకులందు రాజమౌళి లెస్స’ అంటూ జక్కన్న పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, ఆ వుడ్.. ఈ వుడ్ అని తేడా లేకుండా అందరూ రాజమౌళిని తోపు తురుము ఉరుము అంటూ తెగ పొగిడేస్తున్నారు. నిజమే, రాజమౌళి కారణంగా ఇప్పుడు భారతీయ సినిమా రంగంలో ప్రస్తుతం తెలుగు సినిమాపైనే ఎక్కువ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 28, 2021 / 03:29 PM IST
    Follow us on

    SS Rajamouli: కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇప్పుడు ఇతర భాషల సినీ ప్రముఖులంతా ‘దర్శకులందు రాజమౌళి లెస్స’ అంటూ జక్కన్న పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్, కోలీవుడ్, ఆ వుడ్.. ఈ వుడ్ అని తేడా లేకుండా అందరూ రాజమౌళిని తోపు తురుము ఉరుము అంటూ తెగ పొగిడేస్తున్నారు.

    SS Rajamouli

    నిజమే, రాజమౌళి కారణంగా ఇప్పుడు భారతీయ సినిమా రంగంలో ప్రస్తుతం తెలుగు సినిమాపైనే ఎక్కువ ఫోక‌స్ ఉంది. టాలీవుడ్ నుంచి సినిమా వస్తోంది అనగానే.. బాలీవుడ్ జనం ఆ సినిమా పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఒక విధంగా పుష్పకి హిందీలో కలెక్షన్స్ వచ్చాయి అంటే.. కారణం అదే. తెలుగు సినిమాల్లో ఎలాగైనా స‌రే భాగం పంచుకోవాల‌ని క‌ర‌ణ్ జోహార్ లాంటి హిందీ దిగ్గజ దర్శకనిర్మాత కూడా ఉత్సాహం చూపిస్తున్నాడంటే.. అది రాజమౌళి గొప్పతనమే.

    అసలు టాలీవుడ్ కి అంటూ ఒక స‌త్తా ఉందని, ఆ సత్తా ఇది అని రాజమౌళి ఒక్కడే నిరూపించాడు. నిజంగానే రాజమౌళిని ఎవరూ అంచ‌నా వేయలేరు. అంచనాలకు కూడా సంచనాలు చూపించే ఏకైక దర్శకుడు రాజమౌళి. బాహుబ‌లి సినిమా వల్లే నేడు రాజమౌళికి పేరు రాలేదు. కేవలం రాజమౌళి కారణంగానే బాహుబలికి పేరు వచ్చింది.

    Also Read: మహేష్-రాజమౌళి కాంబోపై ఎన్టీఆర్, చరణ్ సెటైర్లు..!

    తెలుగు మార్కెట్ రో పాటు రాజమౌళికి పాన్ ఇండియా మార్కెట్ కూడా బాగా తెలుసు. ఎవరిని ఎక్కడ పట్టుకోవాలి, ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి లాంటి విషయాల్లో కూడా రాజమౌళి మహా దిట్ట. సినిమాని జక్కన్న చాలా చ‌క్క‌గా అర్థం చేసుకోగ‌లడు. అందుకే, కరుణ్ జోహార్ లాంటి పెద్ద అహంభావి కూడా రాజమౌళి విషయంలో చిన్నపిల్లాడిలా తెగ ఎగ్జైట్ అయిపోయి పొగిడేస్తున్నాడు.

    కరుణ్ జోహార్ మాట్లాడుతూ.. ‘నా ఆఫీసుకు సినీ ప్రముఖులు ఎప్పుడూ వ‌స్తూనే ఉంటారు. కానీ రాజమౌళి వ‌చ్చిన‌ప్పుడు మాత్రం, నా ఆఫీస్ అంతా జనంతో నిండిపోయింది. ఇదేమిటి ? కేకలు ఈలలతో నా ఆఫీస్ ఇలా మార్మోగిపోతోంది అంటూ నేను ఆశ్చర్యపోయాను. అది.. రాజమౌళి సంపాదించుకున్న క్రేజ్. అంటూ చెప్పుకొచ్చాడు క‌ర‌ణ్‌.

    Also Read: ‘రాజమౌళి’కి ఉన్న క్లారిటీ అమోహం !

    Tags