https://oktelugu.com/

CM Jagan: జనం మెడ పై కత్తి పెట్టిన జగన్

వచ్చే ఎన్నికల్లో ఓటు వేసేందుకు బయలుదేరిన వారికి బెదిరింపులు తప్పవు. ప్రతి పౌరుడి బలం, బలహీనతలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : July 31, 2023 / 09:40 AM IST

    CM Jagan

    Follow us on

    CM Jagan: కుటుంబంలో ఒకరి వివరాలు ఒకరి దగ్గర ఉంటాయో తెలియదు కానీ.. ఆ కుటుంబ వివరాలు మొత్తం మాత్రం జగన్ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఏపీలో ప్రజలందరి 360 డిగ్రీల ప్రొఫైలింగ్ ను ప్రభుత్వం చేసేసింది. వ్యక్తిగత గొప్యత సమాచారాన్ని పూర్తిస్థాయిలో తన గుప్పెట్లో పెట్టుకుంది.

    గత ఎన్నికలకు ముందు డేటా చోరీ చేశారని విపక్ష నేతగా ఉండేటప్పుడు జగన్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మొన్నటి వరకు దానిపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే అదంతా అబద్ధమని తెలుసు. కానీ తాను చేస్తున్న పని బయటపడకూడదన్న ముందస్తు ఆలోచనతోనే ఆరోపణలు చేశారని ఇప్పుడు తెలుస్తోంది. దీంతో జగన్ తీరు చూస్తుంటే ఆయన తెలివితేటలను అభినందించక తప్పదు.

    వచ్చే ఎన్నికల్లో ఓటు వేసేందుకు బయలుదేరిన వారికి బెదిరింపులు తప్పవు. ప్రతి పౌరుడి బలం, బలహీనతలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. చివరకు వివాహేతర సంబంధాల గుట్టు కూడా తన వద్ద పెట్టుకున్నారు. మనం ఊహించలేనంత వ్యక్తిగత సీక్రెట్లు ప్రభుత్వం సేకరించగలిగింది. వాలంటీర్లు ప్రతి రెండు నెలలకు ఒకసారి సర్వే చేస్తున్నారు..ఏవేవో వివరాలు అడుగుతున్నారు కదా.. అవన్నీ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసమే అని భ్రమించి సామాన్య జనాలు పూర్తిస్థాయి వివరాలను వారికి అందించారు. ఇప్పుడు వాటితోనే అసలు సిసలు రాజకీయం చేయాలని అధికార పార్టీ ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది.

    గత ఎన్నికల్లో ఒకే ఒక్క ఛాన్స్ అన్న నినాదం వర్కవుట్ అయింది. ఈసారి మాత్రం అలా జరిగే అవకాశమే లేదు. ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయించుకుని ఓట్లు వేయించుకోవాలన్న ఓ లక్ష్యం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తప్పుడు ఆలోచనలతో ఏపీ ప్రజల 360 ప్రొఫైలింగ్ ను చేతిలో పెట్టుకుని ఆడుతున్న గేమ్ మున్ముందు .. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడనుంది. అంతిమంగా ప్రజాస్వామ్యానికే విఘాతం కలగనుంది .