Rupee Falls: మోడీ సర్కార్ పాలనలో రూపాయికి పట్టపగ్గాల్లేకుండా పడిపోతూనే ఉంది. మోడీ సర్కార్ ఎన్ని ఆర్థిక సంస్కరణలు చేస్తున్నా కూడా రూపాయి విలువ మాత్రం నిలకడగా ఉండడం లేదు. పడిపోతూనే ఉంటోంది. ఈ పతనంతో వ్యాపారవర్గాలు, భారత ఆర్థిక వ్యవస్థ డీలా పడిపోతోంది.
జులై 19న జీవితకాల కనిష్టానికి దిగజారి రూ.80 రూపాయలకు చేరడం ఓ రికార్డును సృష్టించింది. తాజాగా మరింతగా రూపాయి పడిపోయింది. రికార్డుస్థాయికి పతనమైంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 80.13కి చేరింది.
డాలరుతో రూపాయి మారకం విలువ పతనం అవుతుండడంతో ప్రతిపక్షాలు, ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. రాహుల్ గాధీ, సహా ప్రతిపక్షాలు ఇదే ‘అచ్చేదిన్’ అని మోడీని ఎగతాళి చేస్తున్నారు.
అమెరికన్ ఫెడరల్ బ్యాంకు చైర్మన్ తాజాగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని.. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి వాటిని పెంచక తప్పదని సంకేతాలు ఇచ్చారు. దీంతో అమెరికన్ మార్కెట్లు కుప్పకూలాయి. ఏకంగా పారిశ్రామికవేత్తలు 6 లక్షల కోట్ల డాలర్ల సంపద కోల్పోయారు. అదే ఇప్పుడు రూపాయి విలువ పతనానికి దారితీసింది. దీంతో భారత చమురు కొనుగోళ్లకు ఇంకా భారీగా వెచ్చించే అవకాశం ఏర్పడింది. దీనివల్ల ద్రవ్యోల్బణం కూడా పెరుగి ధరలు ఆకాశాన్ని అంటడం ఖాయం.