విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు దారుణానికి పాల్పడ్డాడు . తన పిల్లలుగా భావించి వారిని కాపాడాల్సిన అతడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఫలితంగా అభం, శుభం తెలియని ఓ బాలిక అభాసుపాలైంది. చిన్న వయసులోనే పెద్ద భారం మోయాల్సి వచ్చింది. ఏపీలోని విశాఖ జిల్లాలో ఓ సంఘటన మనసులను కలిచివేసింది. భవిష్యత్ బాగుండాలని విద్యాబుద్దులు నేర్చుకునేందుకువచ్చిన ఓ విద్యార్థినిపై ఓ ఉపాధ్యాయుడు కర్కటంగా ప్రవర్తించాడు. అలనా పాలనా చూడాల్సిన ఆయన ఆమెను గర్భవతిని చేశాడు. ఈ సంఘటనపై పూర్తి వివరాల్లోకి వెళితే…
విశాఖ పట్టణంలోని ఓ ప్రముఖ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న ఓ టీచర్ తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొన్ని రోజులుగా ఆ విద్యార్థిని అనారోగ్యంతో ఉండడంతో తల్లిదండ్రులు గమనించారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చిన్న వయసులోనే ఆమె గర్భవతి అయిందని వైద్యులు చెప్పడంతో కోలుకోలేకపోతున్నారు. అసలేం జరిగిందని బాలికను తల్లిదండ్రులు చెప్పగా అసలు విషయం చెప్పింది ఆ బాలిక.
తన పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు తనపైన అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే ఆ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికల రక్షణ కోసం అనేక చట్టాలు వస్తున్నప్పటికీ ఇలాంటి దారుణాలు ఆగడం లేదు. ముఖ్యంగా మహిళలపై ఇలాంటి పనులు చేసేవారిని కఠినంగా శిక్షించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే పాఠశాలలో ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం సర్వత్రా చర్చ సాగుతోంది.