AP employees: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా మారింది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారయింది. ప్రభుత్వంపై కోపంతో ధర్నా చేసినా ఎవరు కూడా మద్దతు తెలపలేదు. కనీసం ప్రతిపక్షం కూడా ఉద్యోగులకు మద్దతు తెలపడానికి రాకపోవడం గమనార్హం. దీంతో ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్న పోకచెక్కలా మారుతోంది. ప్రభుత్వం సమయానికి జీతాలు ఇవ్వకుండా వేధిస్తోంది. అదే సమయంలో పీఆర్సీ ప్రకటించకుండా తాత్సారం చేస్తోంది.

గతంలో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నాలు చేశారు. ఉద్యోగుల విషయంలో రాజీ లేని పోరాటం చేశారు. కొంతవరకు విజయం సాధించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భవిష్యత్ అంధకారంగా తయారయింది. ప్రభుత్వం మెప్పు కోసం పాకులాడినా లాభం లేకుండా పోతోంది. ఉద్యోగుల ప్రయోజనాలు పట్టించుకోవడం లేదు.
ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం పడింది. కానీ ఉద్యోగులు మాత్రం ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో ఉద్యోగుల భవితవ్యం డోలాయమానంలో పడుతోంది. ఏపీ ఉద్యోగులు తమ పీఆర్సీ ప్రకటించాలని నిన్న సచివాలయంలో ధర్నా చేసినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. కనీసం ప్రతిపక్ష నేతలు కూడా వారికి సంఘీభావం ప్రకటించకపోవడం గమనార్హం.
Also Read: Politics: వడ్ల చుట్టే రాజకీయం.. రైతులతో ఇరు పార్టీల చెలగాటం..
ఈ నేపథ్యంలో ఉద్యోగుల ప్రయోజనాలు గాలిలో దీపంలా మారాయి. ఉద్యోగులకు ఎవరి నుంచి కూడా సహకారం లేదు. అధికార పార్టీ వైసీపీ కూడా వారిని అవమానిస్తోంది. ఉద్యోగులు దుర్భర పరిస్థితిలో ఉండటంతో పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నా సరైన ప్రోద్బలం లేకపోవడంతోనే ముందుకు సాగడం లేదు. ఈ క్రమంలో ఉద్యోగుల భవిష్యత్ ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది.
Also Read: Telangana: తెలంగాణల మరిన్ని ఉప ఎన్నికలకు బీజేపీ సమాయత్తం?