బెంగాల్, అసోం, కేరళలో అధికార పార్టీలు.. తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రతిపక్షాలు

దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాల్లో మరోసారి అధికార పార్టీల హవా కొనసాగుతోంది. ఇక తమిళనాడు, పుదుచ్చేరిలో అధికార పార్టీలు ఓడిపోతూ ప్రతిపక్షాలు గెలుపు దిశగా సాగుతున్నాయి. ఒక పుదుచ్చేరి మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ముందంజలో ఉన్న పార్టీలు అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ మార్కును దాటేశాయి. ఫలితాలపై మధ్యాహ్నం 12.30 […]

Written By: NARESH, Updated On : May 2, 2021 12:32 pm
Follow us on

దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాల్లో మరోసారి అధికార పార్టీల హవా కొనసాగుతోంది. ఇక తమిళనాడు, పుదుచ్చేరిలో అధికార పార్టీలు ఓడిపోతూ ప్రతిపక్షాలు గెలుపు దిశగా సాగుతున్నాయి.

ఒక పుదుచ్చేరి మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ముందంజలో ఉన్న పార్టీలు అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ మార్కును దాటేశాయి. ఫలితాలపై మధ్యాహ్నం 12.30 గంటల వరకు దాదాపు స్పష్టతవచ్చినట్టైంది.

పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ, అసోంలో బీజేపీ, కేరళలో ఎల్డీఎఫ్ లు మరోసారి అధికారం చేపట్టే దిశగా దూసుకెళ్తున్నాయి. ఇక తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే, పుదుచ్చేరిలో ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టేలా వాతావరణం కనిపిస్తోంది.

బెంగాల్ లో టీఎంసీ వర్సెస్ బీజేపీ హోరాహోరీ తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. కానీ ఫలితాల సరళి చూస్తే అధిక స్థానాల్లో తృణమూల్ ఆధిక్యాల్లో ఉంది. మేజిక్ మార్క్ దాటేసి టీఎంసీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. బెంగాల్ లో మేజిక్ మార్క్ 148 సీట్లు. ఇప్పటికే 180కు పైగా స్థానాల్లో టీఎంసీ లీడ్ లో ఉంది. బీజేపీ 100 లోపే ఆధిక్యంలో ఉంది. దీంతో బెంగాల్ లో టీఎంసీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

అసోంలో బీజేపీదే హవా కనిపిస్తోంది. 126 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో మేజిక్ మార్క్ 64 సీట్లు. బీజేపీ ఇప్పటికే అసోంలో 80 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 40 సీట్లకే పరిమితమైంది.

కేరళలో ఎల్డీఎఫ్ కూటమికే మరోసారి కేరళ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. అక్కడ 140 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 92 స్థానాలు సాధించి మేజిక్ మార్క్ ను కూడా అందుకుంది. విపక్ష యూడీఎఫ్ కూటమి 45 స్థానాల్లోనే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ కేవలం 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో మరోసారి పినరయి విజయన్ నేతృత్వంలో కమ్యూనిస్టు కూటమి అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

తమిళనాడులో డీఎంకే పైచేయి కనిపిస్తోంది. అన్నాడీఎంకే కూడా గట్టి పోటీనిస్తోంది. ఇప్పటివరకు 135 స్థానాల్లో డీఎంకే ఆధిపత్యం కొనసాగుతోంది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి 98 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 234 అసెంబ్లీ సీట్లలో 120 పైచిలుకు డీఎంకే కు రావడం ఖాయం కావడంతో ఆ పార్టీదే అధికారం దక్కనుంది.