
Mobile data – Call plans : ఇటీవల కాలంలో మొబైల్ వాడని వారు లేరంటే అతిశయోక్తి లేదు. అందరు చిన్నదైనా పెద్దదైనా ఫోన్ వాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు ఉద్భవించాయి. ఇందులో ఎయిర్ టెల్, జియో, ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటివి ఉన్నాయి. ఇందులో ఎయిర్ టెల్, జియో వ్యాపార రంగంలో దూసుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వినియోగదారులున్న సంస్థలుగా నిలుస్తున్నాయి. అందరికి ఫోన్ లు అలవాటు చేయడంతో అందరు ఫోన్లు వాడుతున్నారు. దీనికి అనుగుణంగానే ధరలు కూడా పెంచుతున్నాయి. ఏడాదికేడాది టారిఫ్ లు పెంచుతూ వినియోగదారులపై భారం మోపుతూనే ఉన్నాయి.
57 శాతం పెరుగుదల
మొబైల్ ఫోన్ కాల్స్, డేటా రేట్లు త్వరలో పెంచుతున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో ఈ పెంపు ఉంటుందని ఎయిర్ టెల్ చైర్మను సునీల్ మిట్టల్ వెల్లడించారు. గతంలో 28 రోజుల వాలిడిటీతో ఉన్న రేట్లను 57 శాతం పెంచేందుకు నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 8 సర్కిళ్లలో మినిమం రీచార్జి ప్లాన్ ధర రూ. 155కి చేరింది. బార్సిలోనాలో జరుగుతున్న వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే ధరల పెరుగుదలపై నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ టెల్ లాభాలతో కొనసాగుతున్న సమయంలో టారిఫ్ పెంపు సమంజసమేనా? అనే ప్రశ్నలు వస్తున్నా ఎయిర్ టెల్ మాత్రం సమర్థించుకుంటోంది.
కాపిటల్ పెంచుకునేందుకే..
టెలికాం వ్యాపారంలో పెట్టుబడులపై వస్తున్న రిటర్న్ కాపిటల్ తక్కువ వస్తున్నందున టారిఫ్ పెంచుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం 5జీ సేవలు అందిస్తున్న నేపథ్యంలో టారిఫ్ లు పెంచడం తప్పడం లేదని చెబుతోంది. ప్రస్తుత రోజుల్లో అన్ని ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఎయిర్ టెల్ చార్జీలు పెంచడంలో తప్పేమిటని అంటున్నారు. ఇప్పుడు పెంచే చార్జీలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయే కానీ ఎక్కువ మాత్రం కాదని సెలవిస్తున్నారు. మొత్తానికి ఎయిర్ టెల్ సంస్థ వినియోగదారులపై మరింత భారం వేయనుంది.

బలమైన శక్తిగా..
ప్రజలు ఇప్పుడు ఏమి చెల్లించకుండానే 30 జీబీ డేటా వినియోగిస్తున్నారు. భారత్ లో బలమైన శక్తిగా అవతరిస్తున్న ఎయిర్ టెల్ టారిఫ్ లు పెంచడం వల్ల పెద్దగా నష్టమేమీ ఉండదని సూచిస్తోంది. భారత్ లో మూడు టెలికాం కంపెనీలు విస్తరిస్తున్నాయి. ఎయిర్ టెల్, జియో కాగా మూడో స్థానం కోసం బీఎస్ ఎన్ఎల్ నిలుస్తుందా లేదా అనేది తేలలేదు. ప్రస్తుతం ఎయిర్ టెల్ స్వల్పకాలిక లక్ష్యం రూ. 200గా ఉంది. దీన్ని రూ.300లకు పెంచే యోచనలో ఎయిర్ టెల్ ఉంది. ఇందులో భాగంగానే టారిఫ్ పెంపుపై నిర్ణయం తీసుకుంటోంది.
సామాన్యుడి వేతనంతో..
ఇప్పుడు ఫోన్ వాడకం అందరికి అలవాటుగా మారడంతో ఎయిర్ టెల్ రేట్లు పెంచే పనిలో పడుతోంది. సామాన్యుడి సంపాదనపై దృష్టి లేకుండా తమకు లాభాలు రావాలనే ఉద్దేశంతోనే ధరల పెంపుపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. తోచిన విధంగా రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల సామాన్యులపై భారం పడనుంది. కానీ ఇవేమీ పట్టనట్లుగా ఎయిర్ టెల్ ఆలోస్తోంది. ధరల పెంపుపై సమర్థించుకుంటోంది. అన్ని ధరలు పెరుగుతున్నందున తాము కూడా పెంచుకుంటున్నట్లు చెప్పుకుంటోంది.