https://oktelugu.com/

శ్రావణి కేసులో అసలు సూత్రధారి నిర్మాతేనా?

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిర్మాత అశోక్ రెడ్డినే ఈ మొత్తం ఎపిసోడ్ కు సూత్రధారినా అన్న అనుమానాలు పోలీసుల విచారణలో తేలుతున్నట్టు సమాచారం.   బయటకు వస్తున్న సమాచారం భిన్నంగా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. Also Read: మ‌హాస‌ముద్రం: శ‌ర్వా‌తో సై అంటున్న సిద్ధార్థ్ ! శ్రావణి ఆత్మహత్య చేసుకున్న రోజుకు ముందే అశోక్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు ఆమెను హెచ్చరించినట్టు సమాచారం. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2020 / 09:56 AM IST
    Follow us on

    టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిర్మాత అశోక్ రెడ్డినే ఈ మొత్తం ఎపిసోడ్ కు సూత్రధారినా అన్న అనుమానాలు పోలీసుల విచారణలో తేలుతున్నట్టు సమాచారం.   బయటకు వస్తున్న సమాచారం భిన్నంగా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

    Also Read: మ‌హాస‌ముద్రం: శ‌ర్వా‌తో సై అంటున్న సిద్ధార్థ్ !

    శ్రావణి ఆత్మహత్య చేసుకున్న రోజుకు ముందే అశోక్ రెడ్డి ఆమె ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు ఆమెను హెచ్చరించినట్టు సమాచారం. అదే సమయంలో ఇంటికి వచ్చిన సాయి రెడ్డి కూడా తన ప్రేమను నిరాకరించి దేవరాజ్ ను వివాహం చేసుకోకూడదని  వేధించాడని పోలీసులు గుర్తించారు.  అశోక్ రెడ్డి, సాయి రెడ్డిలతో శ్రావణికి సంబంధాలున్నాయని తెలిసి దేవరాజ్ కూడా శ్రావణిని దూరం పెట్టాడని పోలీసులు గుర్తించారు.

    మొత్తానికి, ఈ కేసులో నిందితుడు కాదని మొదట్లో నిర్మాత అశోక్ రెడ్డి కూడా తాజా నివేదికల ప్రకారం ఆమె ఆత్మహత్యలో కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

    Also Read: విజయ్ దేవరకొండకు నిర్మాణ సంస్థ సారీ

    2017 నుండి శ్రావణితో అశోక్ రెడ్డికి సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఆమెకు ఆర్ఎక్స్ 100లో అతిథి పాత్ర అందుకే ఇచ్చారని దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. తరువాత నిర్మాత అశోక్ రెడ్డి ఆమె ఆర్థిక సమస్యలను తీర్చడానికి కొంత డబ్బు ఇచ్చాడని.. తద్వారా  ఆమెను శారీరకంగా మానసికంగా హింసించాడని పోలీసులకు విచారణలో తెలిసినట్టు సమాచారం.  శ్రావణిని తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నాడని.. తన అనుమతి లేకుండా ఎవరినీ వివాహం చేసుకోకూడదని ఆమెను హెచ్చరించాడని విచారణలో తేలినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.