
2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ విశ్లేషకుల అంచనాలకు కూడా అందని స్థాయిలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు సాధించి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. నవరత్నాల్లోని హామీల అమలే ప్రధాన ఎజెండాగా చూపి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో వైసీపీ సక్సెస్ అయింది. అయితే ఎన్నికల ఫలితాల తరువాత పథకాల అమలు కూడా అదే స్థాయిలో ఉందా….? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం కాదనే వినిపిస్తోంది.
Also Read : ఉత్తరాంధ్రలో టీడీపీకి మరో షాక్.. వైసీపీలోకి మరో ఎమ్మెల్యే
జగన్ సర్కార్ మొదట వైయస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా 12,500 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా నగదును మరో 1,000 పెంచి పీఎం కిసాన్ పథకం నగదును కూడా ఈ పథకానికి జత చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు కేవలం 7,500 రూపాయలు మాత్రమే అందుతోంది. మరోవైపు ఆరు నెలల కిందటే పంపిణీ చేస్తామన్న ఇళ్ల పట్టాల పంపిణీ అమలు ఎప్పుడు జరుగుతుందో ఆ పార్టీ నేతలకే అర్థమవడం లేదు.
ఇకపోతే నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని చెప్పిన జగన్ సర్కార్ ఆ హామీని ఎప్పుడు అమలు చేస్తుందో ఎవరికీ తెలియడం లేదు. వాలంటీర్ల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుందని జగన్ సర్కార్ చెప్పినా నేటికీ రేషన్ డీలర్ల ద్వారానే పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం అమలవుతున్నా ప్రస్తుతం కొన్ని జిల్లాలకే ఈ స్కీమ్ పరిమితం కావడం గమనార్హం.
ఇకపోతే పింఛన్ల పెంపు విషయంలో మాత్రం జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంవత్సరం ప్రభుత్వం పింఛన్ ను 2,250 నుంచి 2,500కు పెంచాల్సి ఉన్నా పెంచడం లేదు. పెంచిన పింఛన్ ఎప్పటినుంచి అమలులోకి వస్తుందో కూడా చెప్పడం లేదు. వైఎస్సార్ జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తామని జగన్ సర్కార్ చెప్పినా ఆచరణలో మాత్రం ఆ మేరకు ఫలితాలు కనిపించడం లేదు. దీంతో మాట ఇచ్చి మరిచిపోతున్న సీఎం జగన్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
Also Read : ఈ వైసీపీ ఎంపీ మాటలు భలే ఉన్నాయే..?
Comments are closed.