Homeఆంధ్రప్రదేశ్‌Jagan Delhi Tour: జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెనక పొలిటికల్ వ్యూహం.. బాబుకు కష్టాలు తప్పవా..?

Jagan Delhi Tour: జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెనక పొలిటికల్ వ్యూహం.. బాబుకు కష్టాలు తప్పవా..?

Jagan Delhi Tour: కొత్త జిల్లాలు ఏర్పాటు త‌ర్వాత‌.. మంత్రి వర్గ విస్త‌ర‌ణ‌కు ముందు జగన్ హస్తిన పర్యటన ఆసక్తికరంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢీల్లీకి ఎందుకు ప‌య‌న‌మ‌య్యారు.. మోదీ అమిత్ షాల భేటీలో కొత్త జిల్లాల గురించి మాట్లాడే అవ‌కాశం ఉందా.. ప్ర‌తిప‌క్షాన్ని బీజీపీకి దూరం చేసే ప్లాన్ ఏదైనా వేశాడా.. లేక పెండింగ్ అంశాల‌పై మాట్లాడ‌తారా.. రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండ‌గా ఏ అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.. అంటే అవున‌నే అంటున్నాయి ఏపీ రాజ‌కీయ వ‌ర్గాలు.

Jagan Delhi Tour
Y S Jagan

అయితే ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం సహా పెండింగ్ అంశాలను ప్రధానికి వివరించనున్న‌ట్లు తెలుస్తోంది. దిశ చట్టం, మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించే అవకాశం కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల్ని కూడా విడుదల చేయాలని కోరనున్నార‌ని తెల‌స్తోంది.

Also Read: Telangana Salaries: తెలంగాణలో ఏపీ సీన్ రిపీట్.. ఏం జరుగుతోంది..?

విభజన హామీలను కూడా ప్రధాని దగ్గర సీఎం జగన్ ప్రస్తావిస్తారని సమాచారం. పరిపాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పి.. మూడు రాజధానులకు సహకారం అందించాలని కోరనున్నట్టు ఢిల్లీ వర్గాల టాక్. రాజధాని విషయంలో గత ప్రభుత్వ నిర్ణయాలనే అమలుచేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్రం నిర్ణయం ఫైనల్ దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు.. కొత్త పొత్తుల‌పై చర్చ జరగనున్నట్లు సమాచారం.

అలాగే చంద్రబాబుపై సీబీఐ విచారణ చేయించాలని కోరే అవకాశం కూడా ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కల్తీమద్యం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వంటి అంశాల్లో టీడీపీ.. అధికారపక్షాన్ని ఇరుకున ప‌డేసింది. కాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆ రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ ను కొన్నారంటూ బాంబు పేల్చడంతో ఇప్పుడు ఇదే టాపిక్ ను సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో లేవనెత్తుతారన్న అంశం జోరుగా ప్రచారం జరుగుతోంది.

Jagan Delhi Tour
Y S Jagan

జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న త‌ర్వాత ఏపీలో జ‌రిగే రాజ‌కీయ ప‌రిణామాల‌పై స‌ర్వాత్రా ఆస‌క్తి నెల‌కొంది. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌, రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు ద‌గ్గ‌ర ప‌డుతుండంతో రాజ్య‌స‌భ సీట్ల‌పై కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే జ‌గ‌న్ టూర్ పై నారా లోకేష్ సెటైర్లు వేశాడు. ఇంకేముంట‌ది.. వివేకా హ‌త్య కేసు, ఈడీ దాడులు, ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లు.. ష‌ర్మిల వివాదాలు వంటివే మాట్లాడ‌తార‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శించారు.

Also Read:OTT Releases This Week: ‘ఓటీటీ’ : ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

3 COMMENTS

  1. […] Ram Charan: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ పిక్ లీక్ అయ్యింది. పైగా ఈ పిక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ది. ఈ సినిమాలో చరణ్ లుక్ లీక్ కావడంతో.. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. […]

  2. […] SS Rajamouli: రాజ‌మౌళి.. ప్ర‌శాంత్ నీల్.. వీరిద్ద‌రి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్దరూ పాన్ ఇండియా డైరెక్ట‌ర్లే.. ద‌క్షిణాది సినిమాలను పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌కు తీసుకెళ్లారు. ఇప్పుడు వీరిద్ద‌రి సినిమాల కోసం వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఉన్న సినీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ సినిమాతో రికార్డులు క్రియేట్ చేశారు. ప్ర‌శాంత్ నీల్ కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2 తో త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. […]

  3. […] Revanth Reddy vs KTR- Pub Drugs Case: మత్తు పదార్థాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో డ్రగ్స్ దందా మూడుపువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నడిబొడ్డున పట్టుబడిన వారిలో చాలా మంది మత్తు పదార్థాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో సినీ, రాజకీయ, పోలీసు ప్రముఖుల వారసులు ఉన్నట్లు తెలియడంతో ఉలిక్కిపడ్డారు. తరువాత కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి మేనల్లుడు ఉన్నాడంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడంతో రేవంత్ రెడ్డి స్పందించారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular