మళ్లీ మొదలైన మూడు రాజధానుల చిచ్చు?

మూడు రాజధానుల ముచ్చట మళ్లీ తెరపైకి వచ్చింది. వైసీపీ నేతలు విశాఖనే ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించి ఏ క్షణమైనా విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటన చేస్తారని చెప్పారు. ఇప్పటకే పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని, కోర్టు తీర్పులతో సంబంధం లేదని తేల్చారు. ప్రభుత్వ ఉద్దేశం అదే అయితే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని […]

Written By: Srinivas, Updated On : June 3, 2021 7:09 pm
Follow us on

మూడు రాజధానుల ముచ్చట మళ్లీ తెరపైకి వచ్చింది. వైసీపీ నేతలు విశాఖనే ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించి ఏ క్షణమైనా విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటన చేస్తారని చెప్పారు. ఇప్పటకే పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని, కోర్టు తీర్పులతో సంబంధం లేదని తేల్చారు.

ప్రభుత్వ ఉద్దేశం అదే అయితే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. విశాఖలో రాజధాని కోసం భూములు, భవనాలను కూడా చూసినట్లు తెలుస్తోంది. సీఎం నివాసం కోసం కొండపైన స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారు.

అయితే రెచ్చగొట్టే ప్రకటనలు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు రాజకీయవర్గాల్లో వస్తున్నాయి. కరోనా వైఫల్యాలపై ప్రజల్లో చర్చజరగకుండా మరోసారి రాజధాని అంశాన్ని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా న్యాయవ్యవస్థను అవమానించడమేనంటున్నారు.

ప్రజల దృష్టి మళ్లించడమో లేకపోతే జగన్ విశాఖ వెళ్లేందుకు సంకేతాలు పంపడమో చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. మరో వైపు నిన్న విజయసాయిరెడ్డి మాటలకు ఈ రోజు బొత్స మాటలు ఖండలన్నట్లుగా ఉన్నాయి. విజయసాయిరెడ్డి ఈ ఏడాది కాదు ఏ క్షణమైనా అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో మూడు రాజధానుల కేంద్రంగా వైసీపీ ఏదో జరుగుతోందన్నచర్చ మాత్రం మొదలైంది.