Congress Future: దేశంలో బీజేపీ ప్రతిష్ట పెరుగుతోంది. కాంగ్రెస్ అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. అధినాయకత్వమే అసలు సమస్యగా మారి కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం దూరమైపోతోందని తెలుస్తోంది. ఎన్నికల సర్వేలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇంకా కాలం చెల్లలేదని చెబుతోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిర్ణయాలేవీ కాంగ్రెస్ పార్టీని రక్షించడం లేదు సరికదా పార్టీ ప్రతిష్ట రోజురోజుకు గంగలో కలుస్తోంది.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైన ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోతోంది. పోరాట పటిమను ప్రదర్శించలేకపోతోంది. పోరాటాలకు సైతం ముందుకు రావడం లేదు. దీంతో బీజేపీకి నిజమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ మనలేకపోతోంది. దేశంలో చిన్నపాటి ఉద్యమం కూడ చేయలేకపోతోంది. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా స్టేట్లలో కాంగ్రెస్ ఉనికి చూపబోతోందని తాజా అధ్యయనంలో పేర్కొంది.
Also Read: కాంగ్రెస్ కథ మళ్లీ మొదటికి..! రేవంత్ పై ఫిర్యాదుకు సీనియర్ నేత రెడీ..?
ఉత్తరాఖండ్ లో 70 స్థానాలుండగా కాంగ్రెస్ కు 32 స్థానాలు దక్కనున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి 38 సీట్లు రానున్నాయని సర్వే చెబుతోంది. దీంతో కాంగ్రెస్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నట్లు సమాచారం. ప్రీ పోల్ సర్వే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇంకా ప్రజలు ఆదరిస్తారనే అంచనాలు వస్తున్నాయి.
పంజాబ్ లో కూడా కాంగ్రెస్ కు జనం విజయం చేకూరుస్తారనే సర్వేలు సూచిస్తున్నాయి. 117 స్థానాలున్న పంజాబ్ లో ఆప్ 51 స్థానాలు గెలుచుకని అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ కు 46 సీట్లు వస్తాయని చెబుతోంది. గతంలో కాంగ్రెస్ కు 77 సీట్లు దక్కగా ఇప్పుడు 46 సీట్లకు పడిపోవడంతో కష్టాలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: అమిత్‌షాతో సీఎం భేటీ కాకపోవడానికి కారణాలేంటి ?
మణిపూర్ లో కూడా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బలే తగలనున్నాయని తెలుస్తోంది. 60 సాట్లున్న అసెంబ్లీలో బీజేపీకి 27, కాంగ్రెస్ కు 22 సీట్లు దక్కుతాయని సమాచారం. దీనికి తోడు యూపీలో కూడా కాంగ్రెస్ కు గడ్డు రోజులే అని చెబుతున్నాయి. బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ కుదేలైపోయే అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో జనం కాంగ్రెస్ ను ఏ మేరకు ఆదరిస్తారనే దానిపై అందరు ఎదురు చూస్తున్నారు.