Punjab Government
Punjab Government: ఎన్నికల్లో గెలిచిన పార్టీలు కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. కేంద్రంలో అయిన ప్రధానితోపాటు ఆయన కేబినెట్(Cabinate) మంత్రులు ఉంటారు. ఇక రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రులతోపాటు మంత్రులు ఉంటారు. ఎవరికి కేటాయించిన శాఖను వారు చూసుకుంటారు. ముఖ్యమంత్రికి సహాయపడతారు. ఇక కీలక నిర్ణయాలు కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇక్కడ ఓ రాష్ట్రాలో లేని శాఖకు ఓ నేత 20 నెలలు మంత్రిగా పనిచేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగ గుర్తించిన ప్రభుత్వం తర్వా దానిని సవరించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అసలు విషయం బయటికివచ్చింది.
పంజాబ్ సర్కార్ తప్పిందం..
2022 మార్చిలో పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భగవంత్ మాన్(Bhagavanth man) నేతృత్వంలో సర్పారు ఏర్పడింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 2023 మేలో కుల్దీప్‌సింగ్ దళివాల్(Kuldepsingh Dalival)కు రెండు శాఖలు కేటాయించింది. అందులో ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ ఫోరమ్స డిపార్ట్‌మెంట్ ఒకటి. 2024 చివరన మరోసారి పునర్‌వ్యవస్థీకరఱ చేశారు. ఆమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా దానిని సవరించింది. కుల్‌దీప్ సింగ్‌కు కేటాయించిన అడ్మిడిస్ట్రేవ్ రిఫామ్స్ శాఖ ఉనికిలో లేకపోవడంతో సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. అంటే ఉనికిలో లేని శాఖకు కుల్‌దీప్‌సింగ్ 20 నెలలు మంత్రిగా ఉన్నారు.
ఎన్‌ఆర్‌ఐ శాఖ మాత్రమే..
తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. కుల్‌దీప్‌సింగ్ ఇకపై ఎన్నారై వ్యవహారాల శాఖను మాత్రమే నిర్వహిస్తారని పేర్కొంది. దీంతో బీజేపీ నేతలు మాన్ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు నెటిజన్లు సోషల్ మీడియాలో(Social media) మాన్ సర్కార్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ‘సూూపర్ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఆదేశాల మేరకు మన సీఎం భగవంత్ మన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం కుల్దీప్ సింగ్ ధాలివాల్ని ’పరిపాలనా సంస్కరణల శాఖ’ మంత్రిగా చేసింది,‘ అని సోషల్ మీడియా యూజర్ అమితాబ్ చౌదరి ట్వీట్ చేశారు. ఇలాంటివి ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందో తెలియజేస్తుందని పేర్కొన్నాడు. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని తెలిపాడు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The opposition has been criticizing the aap government saying that the punjab minister managed a dysfunctional department for 21 months
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com