Central Government: ప్రస్తుతం ప్రతీ భారతీయుడు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు ఇలా ప్రభుత్వం అందించే సేవల కోసం రకరకాల కార్డులను కలిగి ఉన్నారు. ఈనేపథ్యంలో అన్నిటికీ కలిపే ఒకే ఒక్క కార్డు ఉంటే ఎలా ఉంటుందనే విషయం కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకుగాను ఆధార్ కార్డును పోలిన కార్డును తయారు చేయబోతున్నది.
ఈ కార్డులో డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్ట్ నెంబర్స్, పాన్ కార్డు వంటి ఇతర ఐడీలన్నిటినీ లింక్ చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ప్రతీ భారతీయుడికి కావాల్సిన సేవలన్నీ ఈజీగా అందుతాయని అనుకుంటున్నది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం ‘ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్’ అనే సరి కొత్త మోడల్ రూపొందించేందుకుగాను వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ప్రస్తుతం భారత దేశ ప్రజలు పలు సేవల కోసం ఆధారు కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్టు, ప్రభుత్వ ఐడీ కార్డులను యూజ్ చేస్తున్నారు. ఇలా ఒక్కో పని కోసం ఒక్కో కార్డును వీళ్లు వినియోగిస్తున్నారు. కాగా, వీటన్నిటి స్థానంలో ఒకే ఒక్క డిజిటల్ కార్డు తీసుకొస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆర్థిక సర్వే విడుదల.. దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే?
ఈ ‘ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ’ కోసం కొత్త డిజిటల్ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వేగవంతమైన పనితీరు, కచ్చితమైన ఫలితాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఐడెంటిటీ కార్డు ద్వారా భవిష్యత్‌లో వ్యక్తిగత కేవైసీ ప్రక్రియ అన్ని విభాగాల్లో సులభం అవుతుందని కేంద్రం చెప్తోంది. ఈ కొత్త డిజిటల్ ఐడీ ద్వారా సెంట్రల్, స్టేట్ సంబంధిత డేటా అవెయిలబులిటీలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ డిజిటల్ ఐడీతో సమ్మిళిత వృద్ధి సాధ్యమయ్యేలా కృషి చేస్తున్నారు. దాంతో పాటు దేశంలో ఈ గవర్నెన్స్ అవసరమని, అందుకే ఈ డిజిటల్ ఐడీ క్రియేషన్ అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ డిజిటల్ ఐడీతో భద్రతా పరమైన సమస్యలు వస్తాయని అనుమానాలు వ్యక్తమయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలో అటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తున్నారు. డిజిటల్ ఐడీ వలన సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా ఉండేందుకుగాను ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ డిజిటల్ ఐడీ కార్డుపైన తమ అభిప్రాయాలు, సందేహాలు, సలహాలను చెప్పాలని ప్రజలకు కేంద్రం వచ్చే నెల 27 వరకు టైం ఇచ్చిందని తెలుస్తోంది.
Also Read: చేసే పనులలో విజయం దక్కట్లేదా.. చేయాల్సిన వాస్తు మార్పులు ఇవే!