ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అధికారులనే నియమించుకుంటూ ఉంటారు. వారికే పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఇక.. ఆ ప్రభుత్వం దిగిపోయి మరో ప్రభుత్వం అధికారం చేపట్టగానే సేమ్ రిపీట్ చేస్తుంటుంది. ఇక ఏపీలో చంద్రబాబు పాలనలో తన మాట శిలాశాసనంగా వ్యవహరించిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర్‌రావు పరిస్థితి దయనీయంగా ఉంది.
Also Read: ఏపీలో ఆలయాల యాత్ర..: చినజీయర్ పిలుపు
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఒకప్పుడు అధికార పార్టీ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన ఏబీకి.. ఇప్పుడు భయం అంటే ఏంటో జగన్ సర్కార్ అనుభవంలోకి తెచ్చింది. 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడం వెనుక ఏబీ కీలకంగా వ్యవహరించారని వైసీపీ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార మార్పిడి ఏబీ వెంకటేశ్వరరావుకు కష్టాలు తెచ్చింది. నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌లోనే ఉన్నారు.
ఇక ఆయనకు ఇప్పుడు మరో భయం పట్టుకుంది. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతోంది. ఆ సెలవుల దృష్ట్యా కోర్టులు తెరుచుకోవు. ఒకవేళ అరెస్టైనా బెయిల్‌కు వెళ్లే పరిస్థితి ఉండదు. ఇక సెలవులొస్తే ఎవరైనా ఆనందిస్తారు. కానీ.. ఏబీలో మాత్రం సెలవులు బీపీ పెంచుతుండడం గమనార్హం. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఏబీకి అదే భయంతో ఉన్నారు. ప్రభుత్వం తనను అరెస్ట్ చేస్తుందని. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం
Also Read: దేవుళ్లపై ఎందుకీ కోపం.. మళ్లీ విగ్రహాల ధ్వంసం
తనను అరెస్ట్ చేయకుండా రాష్ట్ర డీజీపీతోపాటు ఏసీబీ డీజీ, సీఐడీ అదనపు డీజీలను ఆదేశించాలని పిటిషన్‌లో ఏబీ కోరారు. గతంలో ఇదే రీతిలో అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు రిట్ పిటిషన్ దాఖలు చేసినా ప్రయోజనం లేకపోయింది. గతంలో ఏబీ పిటిషన్‌కు అసలు విచారణకు అర్హత లేదంటూ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అఖిల భారత సర్వీస్ రూల్స్ కింద క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఏబీకి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయనకు ఈ అరెస్ట్ భయం పట్టుకుంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్