Homeజాతీయ వార్తలుTelangana: దళితబంధు, రుణమాఫీ పథకాల శ్రీకారానికి ముహూర్తం ఖరారు

Telangana: దళితబంధు, రుణమాఫీ పథకాల శ్రీకారానికి ముహూర్తం ఖరారు

TS CM KCR Dalit Bandhu, Runa Mafi

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు, రుణమాఫీ పథకాలను రేపు ప్రారంభించేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 16న హుజురాబాద్ లో వీటిని మొదలు పెట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ర్టంలో సుమారు ఆరు లక్షల మందికి నేరుగా రుణమాఫీ వర్తిస్తుందని తెలుస్తోంది. గతంలో మొదటి విడత రుణమాఫీ పూర్తి చేసినా ప్రస్తుతం రెండో విడతలో రూ. 50 వేల వరకు చేస్తారని చెబుతున్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావించింది. సాంకేతికంగా బ్యాంకర్లతో సంబంధం లేకుండా పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అయింది. గతంలో రుణమాఫీ అంటే నేరుగా రుణాల్ని మాఫీచేసి బ్యాంకులకు నగదు చెల్లించేవారు. ఈసారి రూ.లక్ష వరకు రుణాన్ని నేరుగా రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. హుజురాబాద్ లో సోమవారం దళితబంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. మొదటగా ఐధు వేల మంది దళితులకు ఇవ్వాలని అనుకున్నా అది సాధ్యం కావడం లేదు.

దీంతో 15 మందికి చెక్కులు ఇచ్చి లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజల మద్దతు పొందేందుకు ఎక్కువగా నగదు బదిలీ పథకాలనే నమ్ముకుంటోంది. దీంతో ప్రభుత్వంపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది. లక్షల కోట్ల బడ్జెట్ కావాలంటే ప్రభుత్వం ఎక్కడైనా అప్పులు చేయాల్సిందే. ఆ భారమంతా మళ్లీ ప్రజలపై రుద్దాల్సిందే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాల వైఖరి మారాల్సి ఉన్నా అవి సంప్రదాయ పద్దతులను పక్కన పెడుతూ కొత్త మంత్రాల్ని అందుకుంటున్నాయి. దీంతో రానురాను రాజుగారి గుర్రం గాడిదైందన్నట్లుగా మారుతోంది పరిస్థితి.

రేపు హుజురాబాద్ లో దళితబంధు, రైతు రుణమాఫీ పథకాలను ప్రారంభించి ప్రజలకు అందించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ప్రజల ఖాతాల్లోకి నిధులు మళ్లించేందుకు ఇప్పటికే మార్గదర్శకాలు పూర్తి చేశారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఏ మేరకు ఓట్లు సాధిస్తుందో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. దీంతో ప్రభుత్వం హుజురాబాద్ లో విజయం సాధించాలని భావిస్తున్న తరుణంలో పథకాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version