Rupee
Rupee: అమెరికాలో డాలర్లు పండును. ఇండియాలో సంతానం పండును. అప్పట్లో నెత్తి మాసిన కమ్యూనిస్టులు తెరపైకి తీసుకువచ్చిన ఒక నానుడి ఇది. ఇప్పుడు ఈ నానుడిని ఇక మార్చుకోవాలేమో.. ఇన్నాళ్ళూ ప్రపంచంపై పెత్తనం చెలాయించిన అమెరికా.. తన డాలర్ తో ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెట్టిన అమెరికా.. ఇకపై తన ప్రాభవం కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గ్లోబల్ కరెన్సీగా అమెరికన్ డాలర్ కు ఉన్న పట్టు క్రమంగా సడలిపోతోంది. డాలర్ కు వ్యతిరేకంగా సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్న దేశాల సంఖ్య క్రమంగా పెరిగిపోతుండటమే ఇందుకు నిదర్శనం. ఈ జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరడం విశేషం. ప్రస్తుతం దాదాపు అన్ని దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అమెరికన్ డాలర్లే 60 శాతానికి పైగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజం, రుణాలు, సెక్యూరిటీల లావాదేవీల్లో సగానికి పైగా డాలర్లలోనే కొనసాగుతున్నాయి. విదేశీ కరెన్సీల ఎక్స్చేంజ్ మార్కెట్లలో మొత్తం అన్ని కరెన్సీలను కలుపుకున్న 90% ట్రేడింగ్ అమెరికన్ డాలర్ల ద్వారానే జరుగుతున్నది.. అదే ఇకముందు ఈ పరిస్థితి ఉండకపోవచ్చు.
డాలర్ పై అనివార్యంగా ఆధారపడేలా చేసిన అమెరికా.. ప్రపంచ దేశాలపై పెత్తనం సాగిస్తోంది. అంతర్గతంగా ఆయా దేశాల పాలనలో వేలుపెడుతోంది. నచ్చకుంటే యుద్ధాలు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇన్నాళ్లు అమెరికా పెత్తనాన్ని మౌనంగా భరించిన ప్రపంచ దేశాలు.. ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో సొంత కరెన్సీని బలోపేతం చేసుకోవాలనే కోరికతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలోనే ఉంది. మునుముందు బలోపేతమైతే డాలర్ గ్లోబల్ కరెన్సీ స్థానాన్ని కోల్పోయే రోజులు ఎంతో దూరంలో లేవు.
బ్రెట్టన్ ఉడ్ ఒప్పందం అమెరికా డాలర్ పెత్తనానికి పునాదులు వేసిందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతూ ఉంటారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కుదేలైన అనేక దేశాలు ముఖ్యంగా యూరోప్ దేశాలు వివిధ రకాల ఉత్పత్తుల కోసం అమెరికా మీద ఆధారపడాల్సి వచ్చింది. అయితే వానిజం ఒప్పందాల్లో డాలర్ విలువ ఎలా ఉండాలి అనే విషయంపై ఐక్యరాజ్యసమితి ద్రవ్య, ఆర్థిక సదస్సు అమెరికాలోని న్యూ హాంప్ శై ర్ లోని బ్రెట్టన్ ఉడ్ లో జరిగింది.. 45 దేశాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. అంతర్జాతీయ బంగారు ధరలను డాలర్ విలువకు జతచేస్తూ ఒప్పందం చేసుకున్నాయి. దీంతో ఇతర కరెన్సీల విలువను డాలర్ మారక విలువ కోసం ఈ ఒప్పందం ఒక ప్రాతిపదికను సిద్ధం చేసింది. డాలర్ విలువ ఒక ఔన్స్ బంగారానికి (31.1034768 గ్రాముల) సమానమైంది. 1970లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ డాలర్ విలువను బంగారం ధరకు జత చేయడానికి రద్దు చేశాడు. అయితే అప్పటికే డాలర్ నిల్వలు అన్ని దేశాల్లో పెరిగిపోవడంతో అది గ్లోబల్ కరెన్సీగా అవతరించిపోయింది..
Rupee
పనామా, ఎల్ సాల్వడార్, జింబాబ్వేలాంటి 11 దేశాలు ఇప్పటికీ అమెరికన్ డాలర్నే తమ దేశాల్లో అధికారిక కరెన్సీగా చెలామణి చేస్తున్నాయి. డాలర్ శక్తి సామర్థ్యంతో రెచ్చిపోయిన అమెరికా అనేక సందర్భాల్లో ఆ డాలర్ నే ఆయుధంగా వాడుకుంది. ఉక్రెయిన్ లో భాగమైన క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పుడు వివిధ బ్యాంకుల్లో రష్యా నిల్వచేసిన 64,000 కోట్ల డాలర్లను అమెరికా జప్తు చేసింది. రష్యా విదేశీ మారక నిల్వల్లో ఇది సగానికి పైగా ఉంది. ఇలాంటి ప్రయోగాన్ని వివిధ సందర్భాల్లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, నిజులా వంటి దేశాలపై ప్రయోగించింది. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించిన బ్యాంకులపై పెద్ద మొత్తంలో జరిమానాలు కూడా విధించింది.
క్రీమియా ఆక్రమణ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలు ఎదుర్కొనేందుకు 2014లో రష్యా చైనాతో చేతులు కలిపి డాలర్ కు వ్యతిరేకంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. దీంతో గ్లోబల్ కరెన్సీగా చలామణి అవుతున్న అమెరికన్ డాలర్ కు సవాలు ఎదురయింది. రష్యా, చైనా మధ్య జరిగే అన్ని వ్యాపార లావాదేవీల్లో మారక ద్రవ్యంగా రూబుల్_ యువాన్ లు వినియోగించాలని ఈ రెండు దేశాలు నిర్ణయించాయి. అంతేకాదు రష తన విదేశీ మార్గ ద్రవ్య నిల్వల్లో అధిక శాతం చైనా యువాన్ కరెన్సీని సమకూర్చుకోవాలని కూడా నిర్ణయించింది. దీంతో గత ఏడాదికి రష్యా విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో 60 శాతానికి పెరిగినట్టు రష్యా ఆర్థిక శాఖ ప్రకటించింది. డాలర్ స్థానంలో తమ సొంత కరెన్సీ లోనే వ్యాపార నిర్వహించాలని ఇటీవల చైనా, బ్రెజిల్ నిర్ణయించాయి. లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన బ్రెజిల్ తో చైనా చేసుకున్న ఒప్పందం కారణంగా డాలర్ పెత్తనానికి మరో అవరోధం ఏర్పడింది.
ఇక బ్రెజిల్ రీస్, చైనా యువాన్ బంధం డాలర్ ఆధిపత్యాన్ని నిలువరించింది. గత ఏడాది ఈ రెండు దేశాల మధ్య 15 వేల కోట్ల డాలర్ల విలువైన వాణిజం జరిగింది..డాలర్, యూరో, యెన్, పౌండ్ లకు బదులుగా తమ దేశాల కరెన్సీ లతోనే వ్యాపారం సాగించాలనే ఏకైక ఏ జెండాతో ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక మంత్రిత్వ శాఖలు, ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇటీవల అధికారిక సమావేశం నిర్వహించాయి.
ఇప్పుడు ఇక భారత్ వంతు కూడా వచ్చింది. తన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ఆవిష్కరించే దిశలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డాలర్, యూరో, యెన్, పౌండ్ లతో దీటుగా రూపాయిని గ్లోబల్ కరెన్సీ గా చెలామణి చేసేందుకు తొలి అడుగులు వేస్తోంది. ఇప్పటికే రూపాయిని మారక విలువగా వినియోగించేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రష్యా, శ్రీలంక తో పాటు మొత్తం 18 దేశాల్లో 60 బ్యాంకుల్లో వోస్ట్రో ఖాతాలు తెరిచింది. ఇక రూపాయితో వ్యాపారం చేసేందుకు ఒప్పుకున్న దేశాల్లో బ్రిటన్, మలేషియా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, శ్రీలంక, మాయన్మార్, బోట్ స్వానా, ఇజ్రాయిల్, ఫిజి, ఒమన్, జర్మనీ, కెన్యా, గయానా, మారిషస్, టాంజానియా, ఉగాండా వంటి దేశాలు ఉన్నాయి.. ఇక అమెరికా వాల్ స్ట్రీట్ లో “డాక్టర్ డూమ్” గా పేరుపొందిన ఆర్థికవేత్త నౌరియల్ రుబిని ” వచ్చే రోజుల్లో భారతీయుపాయి అంతర్జాతీయ విపణలో అతి ముఖ్యమైన విదేశీ మారకద్రవ్యంగా అవతరించబోతోంది” అని పేర్కొన్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా పడిపోతున్న రూపాయికి బలం చేకూర్చడంతో మోదీ సఫలీకృతులు అయ్యారు అని చెప్పవచ్చు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The modi government is making efforts to introduce the rupee as an international currency
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com