Tax Free: బీజేపీ ఓన్ చేసుకుంది.. ‘ది కశ్మీర్ ఫైల్స్’కు పన్ను మినహాయింపు?

Tax Free: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని దారుణాలను కళ్లకు కట్టి..కశ్మీర్ పండింట్ల ఊచకోతను ప్రపంచానికి చూపించిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ అద్భుత సినిమా చడీచప్పుడు లేకుండా విడుదలై ఇప్పుడు దేశాన్ని షేక్ చేస్తోంది. ఇక్కడే కాదు విదేశాల్లో విపరీతమైన ప్రజాదరణ పొందుతోంది. అయితే ఒక మతం వారు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్యాన్ చేయాలని నినదిస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి స్వయంగా అభినందించి చిత్ర యూనిట్ ను మెచ్చుకొని దేశమంతా […]

Written By: NARESH, Updated On : March 21, 2022 3:47 pm
Follow us on

Tax Free: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని దారుణాలను కళ్లకు కట్టి..కశ్మీర్ పండింట్ల ఊచకోతను ప్రపంచానికి చూపించిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ అద్భుత సినిమా చడీచప్పుడు లేకుండా విడుదలై ఇప్పుడు దేశాన్ని షేక్ చేస్తోంది. ఇక్కడే కాదు విదేశాల్లో విపరీతమైన ప్రజాదరణ పొందుతోంది. అయితే ఒక మతం వారు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్యాన్ చేయాలని నినదిస్తున్నారు.

The Kashmir Files

ఇక ఈ సినిమాను ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి స్వయంగా అభినందించి చిత్ర యూనిట్ ను మెచ్చుకొని దేశమంతా ఈ సినిమా చూడాలని పిలుపునిచ్చాడు. నెలరోజుల్లోనే తీసిన ఈ చిత్రం విడుదలైన తర్వాత విమర్శకుల ప్రశంసలు అందుకొని కోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సినిమాను ఓన్ చేసుకొని నడిపిస్తుందన్న టాక్ ఉంది.

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 1990 సంవత్సరంలో పథకం ప్రకారం కశ్మీర్ లోయలోని పండిట్స్ పై దాడి చేసి మారణహోమం సృష్టించారు. దీంతో భయభ్రాంతులకు గురైన దాదాపు 5 లక్షల మంది పండిట్స్ కశ్మీర్ లోయను వీడి ఢిల్లీతోపాటు దేశంలోని పలు రాష్ట్రాలకు, విదేశాలకు కాందీశీకులై వలసపోయారు. అక్కడి ప్రభుత్వాలు కానీ,… అధికారులు కానీ ఈ అమానవీయ ఘటనలపై నోరు విప్పింది లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి చేతులు కలిపిన స్థానిక ముస్లింలు కశ్మీరీ పండింట్లతో ఎంత దారుణంగా వ్యవహరించారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు.

దీంతో సహజంగానే హిందుత్వ భావజాలంతో ముందుకెళుతున్న బీజేపీ ఈ సినిమాను ఓన్ చేసుకుంది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సైతం ఈ చిత్రానికి వెన్నుదన్నుగా నిలిచి సెన్సార్ కట్స్ లేకుండా విడుదల చేయించారన్న ప్రచారం ఉంది.

మోడీ షాల పిలుపుతో ఈ సినిమాకు దేశవ్యాప్తంగా పన్ను మినహాయింపులు పలు రాష్ట్రాల్లో లభిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ చిత్రానికి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇప్పటికే హర్యానా,గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు వినోద పన్ను మినహాయింపు రాయితీ ప్రకటించాయి. తాజాగా కర్ణాటక సహా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తోపాటు పలు బీజేపీ రాష్ట్రాలు టాక్స్ ఫ్రీ ప్రకటించారు. రాబోయే రోజుల్లో మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ సినిమాకు పరోక్ష సాయం చేసే అవకాశం కనిపిస్తోంది.,

Recommended Video: