https://oktelugu.com/

Chandra Babu Naidu Grand Son Devansh: దేవాన్ష్ పుట్టిన రోజు.. తిరుమ‌లలో అన్న‌దానం కోసం రూ.30లక్ష‌లు ఇచ్చిన భువ‌నేశ్వ‌రి..!

Chandra Babu Naidu Grand Son Devansh: టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, లోకేష్, బ్రాహ్మ‌ణి దంప‌తుల వార‌సుడు అయిన దేవాన్ష్ గురించి అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఇటు నారా కుటుంబంలో అయినా.. అటు నంద‌మూరి కుటుంబంలో అయినా దేవాన్ష్ అంటే ఎంతో ఇష్టంగా చూసుకుంటారు. లోకేష్‌కు ఒక్క‌గానొక్క కొడుకు కావ‌డంతో.. అత‌ని ప్ర‌తి పుట్టిన రోజును కూడా చంద్ర‌బాబు ఎంతో గ్రాండ్ గా నిర్వ‌హిస్తుంటాడు. చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ఉన్న‌ప్పుడు కూడా అధికారికంగా తిరుమ‌ల‌కు వెళ్లి […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 21, 2022 / 12:32 PM IST
    Follow us on

    Chandra Babu Naidu Grand Son Devansh: టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, లోకేష్, బ్రాహ్మ‌ణి దంప‌తుల వార‌సుడు అయిన దేవాన్ష్ గురించి అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఇటు నారా కుటుంబంలో అయినా.. అటు నంద‌మూరి కుటుంబంలో అయినా దేవాన్ష్ అంటే ఎంతో ఇష్టంగా చూసుకుంటారు. లోకేష్‌కు ఒక్క‌గానొక్క కొడుకు కావ‌డంతో.. అత‌ని ప్ర‌తి పుట్టిన రోజును కూడా చంద్ర‌బాబు ఎంతో గ్రాండ్ గా నిర్వ‌హిస్తుంటాడు.

    Chandra Babu, Devansh

    చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ఉన్న‌ప్పుడు కూడా అధికారికంగా తిరుమ‌ల‌కు వెళ్లి మ‌రీ అన్ని పూజా కార్య‌క్ర‌మాలు, అన్న‌దాన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేవారు. అయితే ఈ సారి కూడా అలాగే చేస్తున్నారు సోమ‌వారం దేవాన్ష్ పుట్టిన రోజు కావ‌డంతో నారా వారి కుటుంబం మొత్తం తిరుమ‌ల‌కు ప‌య‌నం అయింది. ఈ సంద‌ర్భంగా మ‌రోసారి త‌మ దాతృత్వం చాటుకున్నారు భువ‌నేశ్వ‌రి.

    Also Read: IPS officer A B Venkateswara Rao: మీడియా ముందుకు వ‌స్తున్న ఏబీవీ.. పెగాస‌స్ విష‌యంలో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డిస్తారా..?

    గ‌తంలో దేవాన్ష్ పుట్టిన రోజు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా తిరుమ‌ల‌లో ఒక్క రోజు అన్న‌దాన కార్య‌క్ర‌మానికి అయ్యే ఖ‌ర్చు మొత్తం విరాళంగా ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ సారి కూడా భువ‌నేశ్వ‌రి అలాగే చేశారు. టీటీడీ అన్నదానం స్కీమ్‌లో భాగంగా అక్క‌డకు వ‌చ్చే వారికి అయ్యే అన్న‌దానం ఖ‌ర్చుమొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.

    దాదాపు రూ.30లక్షల చెక్కును టీటీడీ అన్న‌దాన నిర్వాహ‌కుల‌కు అంద‌జేశారు భువ‌నేశ్వ‌రి. ఆ మొత్తంలో ఈ ఒక్క‌రోజు8 అన్న‌దానం నిర్వాహించాలంటూ నారా వారి కుటుంబం కోరింది. వారి కోరిక మేర‌కు తరిగొండ వెంగమాంబ నిత్యాన్న దాన ప్రసాద బిల్డింగులో టుడే డోనర్‌ మాస్టర్‌ నారా దేవాన్ష్‌ పేరు మీద అన్నదానం చేస్తున్నారు.

    Also Read: BJP Politics: కేసులు, పెగాసస్.. జగన్, చంద్రబాబులను ఏపీ రాజకీయాల నుంచి బీజేపీ సాగనంపబోతోందా?

    Recommended Video:

    Tags