ఏపీ ప్రజలకు, కరోనా రోగులకు మరో గొప్ప శుభవార్త అందింది. ఇప్పటికే ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలిసిన ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం, హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కంట్లో వేసుకునే ‘కే’ మందుకు మాత్రం హైకోర్టు అనుమతివ్వలేదు. దానిపై పరిశోధన జరుగుతోందని.. నివేదిక వచ్చిన తర్వాత చెబుతామని తెలిపింది. తాజాగా ఆనందయ్య కంట్లో వేసే మందు ‘కే’కు కూడా హైకోర్టు అనుమతిచ్చింది.
ఆనందయ్య ఆయుర్వేద మందు ‘కే’కు కూడా హైకోర్టు తాజాగా ఆమోదం తెలిపింది. ఆనందయ్య సహా మరో ఇద్దరు వేసిన పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈమేరకు తుది తీర్పునిచ్చింది.గతంలోనే ఆనందయ్య నోటి ద్వారా ఇచ్చే మందులకు అనుమతిచ్చిన ప్రభుత్వం, హైకోర్టు ఇప్పుడు కంటిలో వేసే డ్రాప్స్ కు సైతం హైకోర్టు అనుమతించింది.
ఆనందయ్య మందుపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. కరోనాకు మందు లేకపోవడం.. ఈ ఆయుర్వేద మందు పనిచేస్తోందన్న భరోసా నేపథ్యంలో ఔషధంపై రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని హైకోర్టు కోరింది. ఏపీ సర్కార్ కూడా అనుమతించింది. ఆయుష్ నివేదికకు సంబంధించి పూర్తి వివరాలు రాని నేపథ్యంలో వీటికి అనుమతి లభించలేదు. విచారణ చేపట్టిన హైకోర్టు.. కరోనా బాధితులకు తక్షణమే కే పేరిట ఉన్న కంట్లో వేసే మందు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. కంటి చుక్కల మందుకు సంబంధించి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఆనందయ్య మందుకు అనుమతి అవసరం లేదని ఇదివరకే హైకోర్టు వ్యాఖ్యానించింది. తాజా కంట్లో వేసే మందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక అన్ని ఆనందయ్య మందులను పంపిణీ చేయడానికి ఆస్కారం ఏర్పడింది. కరోనా రోగులకు ఈ పరిణామం ఊరటనిచ్చింది. మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది.