జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు కీలక నిర్ణయం

ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ,ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్లను వేటిని ముందుగా విచారించాలన్న పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తయింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జగతి పబ్లికేషన్స్ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో సీబీఐ, ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్లలో ముందుగా ఈడీ చార్జీషీట్లపై విచారణ జరపాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు మొదట జరపాలన్న సీబీఐ, […]

Written By: NARESH, Updated On : July 23, 2021 7:03 pm
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ,ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్లను వేటిని ముందుగా విచారించాలన్న పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తయింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జగతి పబ్లికేషన్స్ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో సీబీఐ, ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్లలో ముందుగా ఈడీ చార్జీషీట్లపై విచారణ జరపాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు మొదట జరపాలన్న సీబీఐ, ఈడీ కోర్టు ఉత్తర్వులు కొట్టివేయాలని కోర్టును కోరారు.

వీటిని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ హైకోర్టును ఆశ్రయించాయి. వీరి పిటిషన్ విచారణ సందర్భంగా మొదట ఈడీ కేసులు విచారించాలన్న ఉత్తర్వులను కొట్టి వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. మొదట సీబీఐ కేసులో లేదా రెండు ఒకేసారి విచారించాలని హైకోర్టును కోరారు.

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) సూర్యకరణ్ రెడ్డి వాదించారు. మనీ లాండరింగ్ చట్టాన్ని 2019లో సవరించారని, కాబట్టి ముందుగా తాము దాఖలు చేసిన అభియోగాలపై విచారణ జరపాలని వాదించారు. ప్రధాన కేసుతో సంబంధం లేకుండా ఈడీ చార్జీ షీట్లపై విచారణ చేపట్టాలన్నారు. దీంతో ఇరువర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తమ తీర్పును రిజర్వ్ చేసింది.