Rushikonda: సాగరనగరంపై వైసీపీ సర్కారు కత్తి కట్టిందా? విధ్వంసానికి తెగబడుతోందా? కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందా? సాగర అందాలను హననం చేయడానికి యత్నిస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రధానంగా రుషికొండ చుట్టూ జరుగుతున్న పనులు గుట్టుగా చేపడుతుండడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రుషికొండ అభివ్రుద్ధి పనుల విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ జగన్ ప్రభుత్వం వెనుకంజ వేయడం లేదు. మొండిగా ముందుకే వెళ్తోంది. తాజాగా కొండపై పునర్నిర్మిస్తున్న రిసార్ట్స్‌లో అభివృద్ధి పనుల కోసం రూ.75.84 కోట్లతో టెండర్లను ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మంగళవారం ప్రకటన జారీచేసింది. ఇంటీరియర్ పనుల కోసం రూ.30.4 కోట్లు, ల్యాండ్ స్కేపింగ్ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ కోసం రూ.45.44 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది.

దీనికి ముందు ఆ కొండను తవ్వి, రహదారులు వేయడానికి గత ఏడాది మార్చి 22న టెండర్లు పిలిచారు. రూ.91.27 కోట్ల విలువ చేసే ఈ పనులను హైదరాబాద్‌కు చెందిన డీఈసీ సంస్థకు కట్టబెట్టారు. ఆ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రెండో దశలో మరో రూ.142 కోట్లతో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్లు తదితరాలు నిర్మిస్తామని ప్రకటించారు. అవి పూర్తయితే.. ఆ భవనాల్లో ఇంటీరియర్ డెకరేషన్‌కు టెండర్లు పిలవాలి. ఆ తర్వాత ల్యాండ్ స్కేపింగ్ పనులు కూడా చేపట్టాలి. కానీ అసలు భవనాలే నిర్మించకుండా.. కొండపైకి సరైన రోడ్డే లేకుండా.. ఇలా టెండర్లు పిలవడం చూస్తుంటే.. దీని వెనుక తెలియని వ్యవహారాలు ఏవో నడుస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Ante Sundaraniki: నాని కి గడ్డుకాలం… అంటే సుదరం బుక్కైపోడు కదా!
ఇవన్నీ బయటపడతాయనే రుషికొండ వద్దకూ ఎవరినీ రానివ్వడం లేదు. అక్కడ జరుగుతున్న విధ్వంసాన్ని పరిశీలించడానికి ఎవరు వెళ్లినా అడ్డుకుంటోంది. నాలుగు రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజులను పోలీసులు బీజేపీ కార్యాలయం వద్దే ఆపేశారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా తెలుగుదేశం నాయకులు రుషికొండ వద్దకు వెళ్లి మొక్కలు నాటాలని ప్రయత్నిస్తే.. వారినీ ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

కోర్టులను తప్పుదారి పట్టిస్తూ..
రుషికొండపై రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రాన్ని, ఇటు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది. రుషికొండపై హరిత రిసార్ట్స్‌ను పునర్నిర్మిస్తున్నామంటూ అనుమతులు తీసుకుంది. కొండ పై పర్యాటక శాఖకు మొత్తం 61 ఎకరాల భూమి ఉండగా అందులో 9.88 ఎకరాలనే వినియోగించుకుంటామని తెలిపింది. అందులోనూ 5.18 ఎకరాల్లోనే భవనాలు నిర్మిస్తామంది. కానీ మాటలకు, పనులకు పొంతన లేదు. రుషికొండపై హరిత రిసార్ట్స్ చిన్నగా ఉండేవి. పునర్నిర్మాణమంటే.. కొంచెం అటూఇటుగా తవ్వుకోవచ్చు. కానీ ప్రభుత్వం ఆ కొండను చుట్టూ తవ్వేసింది. హరిత రిసార్ట్స్ ఇదివరకు ఎంత విస్తీర్ణంలో ఉండేవో.. అంతే ఏరియాలో పునర్నిర్మాణ పనులు చేపట్టాలని, అంతకు మించి కొండను ముట్టుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ ఏ మేరకు తవ్వకాలు జరిగాయో సర్వే చేయిస్తే.. నిజాలు బయటపడతాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
Also Read:YCP Govt- Police: ఖాకీలైతే గొప్ప? పోలీసులనూ వదలని వైసీపీ సర్కారు