spot_img
Homeజాతీయ వార్తలుMonkeypox : ఇండియాలోకి ఎంటర్‌ అయిన మహమ్మారి.. తొలి అనుమానిత కేసు.. కేంద్రం అలర్ట్‌!

Monkeypox : ఇండియాలోకి ఎంటర్‌ అయిన మహమ్మారి.. తొలి అనుమానిత కేసు.. కేంద్రం అలర్ట్‌!

Monkeypox : కరోనా తర్వాత ప్రపంచాన్ని భయపెడుతున్న మరో వైరస్‌ మంకీపాక్స్‌(ఎంపాక్స్‌). ఆఫ్రికాలో ఈ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. అన్ని దేశాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. వైరస వ్యాప్తిపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. మరోవైపు వైరస తమ దేశంలోకి రాకుండా అన్ని దేశాలు అలర్ట్‌ అయ్యాయి. భారత్‌ కూడా అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చేవారిని టెస్టు చేయాలని సూచించింది. రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) వ్యాప్తి చెందుతున్న దేశం నుంచి భారత్‌కు వచ్చిన ఒక యువకుడిని ఎంపాక్స్‌ అనుమానిత కేసుగా గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. Æ øగిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో ఒంటరిగా ఉంచారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది.

నిర్ధారణ పరీక్షలు..
‘ఎంపాక్స్‌ ఉనికిని నిర్ధారించడానికి రోగి నుంచి నమూనాలను పరీక్షిస్తున్నారు. ఈ కేసును నిర్దేశించిన ప్రొటోకాల్‌లకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో దాని ప్రభావాన్ని అంచనా వేయడానికి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. ఇటువంటి ఒంటరి ప్రయాణ మంకీపాక్స్‌ సంబంధిత కేసును ఎదుర్కోవడానికి దేశం పూర్తిగా సిద్ధంగా ఉందనీ, ఏదైనా సంభావ్య ప్రమాదాన్ని నిర్వహించడానికి, తగ్గించడానికి బలమైన వ్యవస్థలు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఎందుకు ప్రమాదకరం
మంకీపాక్స్‌ ఒక వైరల్‌ ఇన్ఫెక్షన్‌. ఇది స్మాల్‌పాక్స్‌ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరంపై దద్దుర్లు పెద్దవిగా ఏర్పడి తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ఈ వ్యాధి పాక్స్‌వైరిడే కుటుంబానికి చెందిన మంకీపాక్స్‌ వైరస్‌ వల్ల సంభవిస్తుంది.

లక్షణాలు ఇవీ..
మంకీపాక్స్‌ లక్షణాల్లో జ్వరం ఒకటి. సాధారణంగా 1–2 వారాలు జ్వరం క్రమంగా పెరుగుతుంది. మంకీపాక్స్‌ కారణంగా తీవ్రమైన తలనొప్పి కూడా ఉంటుంది. అలాగే, శరీర భాగాలలో నొప్పులు క్రమంగా పెరుగుతాయి. చర్మంపై చిన్న కురుపులు ఏర్పడి క్రమంగా అవి పెద్దవిగా పెరుగుతాయి. ప్రారంభంలో సాధారణంగా కనిపించి పసుపు రంగు నుంచి పసుపు బంగారు రంగులోకి మారుతాయి. అలాగే, అలసట, కళ్లు మండటం, శరీర నొప్పులు, ముక్కు కారటం కూడా వుండవచ్చు.

ఎలా వ్యాపిస్తుంది?
మంకీపాక్స్‌ ప్రధానంగా మధ్య–పశ్చిమ ఆఫ్రికాలో గుర్తించారు. ఆ తర్వాత చాలా ప్రాంతాలకు వ్యాపించింది. అయితే, 2022 నుంచి ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాలను ప్రభావితం చేస్తోంది. అమెరికా, యూరప్‌ దేశాలు, కొన్ని ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్‌ సాధారణంగా నేరుగా తాకడం వల్ల వ్యాపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో శ్వాస సంబంధిత గాలి ప్రవాహం ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చు. వ్యాధి ప్రాథమిక నివారణలో వ్యాధి వ్యాప్తిని తగ్గించేందుకు వ్యాక్సినేషన్, ఇతర వైద్య చికిత్సలు అందిస్తారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper