First Billionaires : మనదేశంలో శ్రీమంతుడు ఎవరు అంటే ఎవరైనా ఏ సమాధానం చెబుతారు.. అదానీ లేదా అంబానీ అంటారు. లేక ఆనంద్ మహీంద్రా పేరో.. మరొకరి పేరో చెబుతారు. కానీ వీరందరి కంటే ముందే ఒక బిలియనీర్ మనదేశంలో ఉన్నాడు. 2023 నాటికి ఆయన ఆస్తుల విలువ దాదాపు 3 లక్షల కోట్లు. వజ్రాల గనులు, కిలోల కొద్ది బంగారం, 50 రోల్స్ రాయిస్ కార్లకు అధిపతి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఐశ్వర్యానికి సాటి మరిది ఉండదు. హుందాతనం, రాజరికం, విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్ లాగా అతడు నిలిచాడు. ఇంతకీ అతడు ఏ ఉత్తర భారతీయుడో కాదు.. అచ్చంగా, హైదరాబాద్ వాసి. అతని పేరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. హైదరాబాద్ నిజాం ప్రభువు. హైదరాబాద్ సంస్థానాన్ని దాదాపు 2024 సంవత్సరాలు నిజాం ప్రభువులు పరిపాలించారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం భారత యూనియన్ లో విలీనం చేశారు..
ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్కల ప్రకారం భారతదేశపు మొట్టమొదటి బిలియనీర్ నిజాం. నిజాంల పరిపాలనలో చివరివాడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అతడు గడిపేవాడు. భారీగా ఖర్చులు చేసేవాడు. అలీ ఖాన్ 1911 లో తన 25వ సంవత్సరంలో హైదరాబాద్ సంస్థానం సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే నిజం ప్రభువుకు అతిపెద్ద ఆదాయ వనరు గోల్కొండ గనులు. ఆ గనుల్లో దొరికిన వజ్రాలు నిజాం ఖజానాకు చేరేవి.. అలీ ఖాన్ సింహాసనాన్ని అధిష్టించిన మూడు సంవత్సరాల తర్వాత 1914లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో బ్రిటిష్ వాళ్లకు అలీ ఖాన్ ఆర్థికంగా సహాయం చేశాడు. 1917లో ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు చేశాడు. సొంత కరెన్సీ, 50 రోల్స్ రాయిస్ కార్లకు అలీ ఖాన్ యజమానిగా ఉండేవాడు. అతడికి 100 మిలియన్ ఫౌండ్ బంగారం, 400 మిలియన్ ఫౌండ్ల నగలు, సొంత విమానయాన సంస్థ ఉండేది. క్వీన్ ఎలిజబెత్ _11 కు మూడు వందల వజ్రాలతో కూడిన నెక్లెస్ సెట్ ను పెళ్లి కానుకగా ఇచ్చాడు. అంతేకాదు అలీ ఖాన్ 1000 కోట్ల రూపాయల విలువైన వజ్రాన్ని పేపర్ వెయిట్ గా ఉపయోగించే వాడని చెబుతుంటారు. ఇక 1940 ప్రారంభంలో నిజాం మొత్తం ఆస్తులు 1700 కోట్లుగా ఉండేవని.. 2023 నాటికి అవి దాదాపు మూడు లక్షల కోట్లకు చేరుకున్నాయని సమాచారం.
అలీ ఖాన్ తర్వాత కృష్ణరాజ వడియార్_4 అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 1940లో అతడి వ్యక్తిగత సంపద 400 మిలియన్ డాలర్లుగా ఉండేది.2018 నాటికి అది ఏడు బిలియన్ డాలర్లకు చేరుకుంది. కృష్ణరాజ వడియార్_4 మైసూర్ రాజ్యానికి 24వ మహారాజు. 1902 నుంచి 1940 వరకు ఆయన మైసూరు రాజ్యాన్ని పాలించారు. ఈయన రాజర్షి గా పేరు గడించారు.. పాల్ బ్రాండన్ అనే ఆంగ్ల రచయిత కృష్ణరాజు వడియార్ ను గొప్ప తత్వవేత్త అయిన రాజుగా కీర్తించారు. విస్కౌంట్ హెర్బర్డ్ సామ్యూల్ అతడిని అశోక చక్రవర్తిగా పోల్చారు. 1930లో లండన్లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మైసూరు ప్రపంచంలోనే అత్యుత్తమ పరిపాలన రాష్ట్రంగా ప్రకటించారు. కృష్ణంరాజు వడియార్ ను ఆధునిక మైసూర్ పితామహుడిగా పేర్కొంటారు. అతని పరిపాలన స్వర్ణ యుగమని.. పండిట్ మదన్ మోహన్ మాలవ్య కీర్తించారు. అంతేకాదు మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి సుప్రసిద్ధ ఇంజనీర్ కూడా కృష్ణరాజు వడియార్ ద్వారా తన స్ఫూర్తి పొందానని పలుమార్లు ప్రకటించారు. అయితే వ్యక్తిగత సంపదలో కృష్ణరాజు వడియార్ అలీ ఖాన్ తర్వాత రెండవ స్థానంలో నిలిచారు.