Telugu Film Industry: సినిమాల టికెట్ల గురించి జగన్ ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాడు ? సినిమాకు వెళ్ళడానికి వంద రూపాయలు ఖర్చు పెట్టాలా ? నాలుగు వందలు ఖర్చు పెట్టాలా ? అనేది ప్రజల వ్యక్తిగత విషయం. మార్కెట్ లో ఒక షర్టు విలువ రెండు వందలు ఉంటుంది అనుకుందాం. బ్రాండ్ పేరుతో అదే షర్టును 100 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. ఇది ఒక్క షర్టు విషయంలోనే కాదు, ప్రతి నిత్యావసర వస్తువులోనూ ఇదే జరుగుతుంది.
మరి జగన్ ప్రభుత్వం వాటి గురించి ఎందుకు పట్టించుకోదు ? ఈ రోజు ఏపీలో జరుగుతున్న అన్యాయాల గురించి ? జరుగుతున్న దోపిడీల గురించి జగన్ కు తెలియదా ? లేక, అవన్నీ చేస్తోంది తమ పార్టీ వారే కాబట్టి వదిలేశారా ?. జగన్ పార్టీకి సంబంధించిన మంత్రి ఓ మాట అన్నారు. 200 ఖర్చు చేసి ఓ సినిమాకి వెళ్తే.. ఆ సినిమా నచ్చదు, అప్పుడు ఏం చేయాలి ? అంటూ ఆ మంత్రి గారు అడిగారు.
అదే మాటను ప్రభుత్వానికి ఎందుకు వర్తించదు. ప్రజలు కూడా అలాగే భావించడం లేదు అని ఆ మంత్రి ఎందుకు అనుకుంటున్నారు. అసలు అర్థం పర్థం లేని ఆణిముత్యాల్లాంటి మాటలు ఏపీ మంత్రుల నోట వస్తూనే ఉన్నాయి. చాలావరకు అవి తమ వ్యక్తిగత అభిప్రాయాలు అని కూడా వారు చెప్పరు. ప్రభుత్వం నిర్ణయంగానే వాళ్ళు చెబుతూ ఉంటారు. అయినా జగన్ మాత్రం ఈ విషయాల పై స్పందించడు.
Also Read: అటు మరీ తక్కువ, ఇటు మరీ ఎక్కువ.. చిన్న సినిమాలకు దారేది ?
ఏది ఏమైనా ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. సినిమా పరిశ్రమలోని వ్యక్తులందరూ టీడీపీకి చెందిన వాళ్ళుగా జగన్ అర్ధం చేసుకున్నారేమో. సినీ పరిశ్రమ అంటే.. స్టార్లు మాత్రమే కాదు లక్షల మంది కార్మికులు, సినిమా పరిశ్రమ అంటే.. నాలుగు కుటుంబాలు మాత్రమే కాదు, లక్షల కుటుంబాలు.
మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి ఆ లక్షల మంది బలి అవ్వాలా ? సినిమా ఇండస్ట్రీలో హిట్లు శాతం తక్కువ, డిజాస్టర్లు ఎక్కువ. ఇప్పటికైనా జగన్ అర్థం చేసుకుంటే మంచిది. లక్షల మంది కార్మికులకు మంచి చేసినవాడు అవుతాడు.
Also Read: మూవీ టికెట్స్ ధరలు.. ఏపీలో వాత.. తెలంగాణలో మోత..?