Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు జోరు పెంచడానికి ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న పార్టీని మళ్లీ పట్టాలెక్కించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. రేవంత్ రెడ్డిని గృహనిర్బంధం చేసింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రభుత్వం ఆగడాలను అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
ప్రభుత్వం పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుంది. అందుకే ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఫలితంగా ప్రతిపక్షాలు సైతం తమ గొంతు విప్పకుండా చేసేందుకు అడుగడుగునా అడ్డుకుంటోంది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇంటిని గృహ నిర్బంధం చేయడంతో కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది.
Also Read: మోహన్ బాబుకు రాజభవనాన్ని తలపించే ఇల్లు.. మంచు లక్ష్మీ వీడియో వైరల్!
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 317 తో ఉద్యోగులు నానా తిప్పలు పడుతున్నారు. కొత్త విధానంతో జూనియర్ ఉద్యోగులకు నష్టాలే తలెత్తుతున్నాయి. దీంతో వారు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా నిరుద్యోగులకు కూడా ఇబ్బందులే తలెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు.
వరంగల్ జిల్లాలో జరిగే కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేయడంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వం నానాటికి దిగజారిపోతోందని చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలతో ప్రజలకు మేలు తప్ప కీడే జరుగుతోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది.
Also Read: జీఎస్టీ పేరుతో జనాలకు టోపీ పెడుతున్నారు.. తప్పు ఎవరిది?