MP Kesineni Nani Vs Kesineni Chinni: విజయవాడ ఎంపీ కేశినేని నాని తన కారు, పరపతి ఉపయోగించుకుంటున్నారని కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆయన కేసు పెట్టింది ఎవరి మీదో కాదు. స్వయాన ఆయన సోదరుడి మీదే. దీంతో పోలీసులు కంగుతిన్నారు. తమ్ముడిపై కేసు పెట్టడం ఏమిటని ఆశ్చర్యపోయారు. రాజకీయాల్లో ఎవరైనా కానీ పడకుండా అయితే అంతే సంగతి. సహోదరుడిపై కేసు సంచలనంగా మారింది. పోలీసులకు కూడా ఎటూ తోచడం లేదు. కేసుపై ఎలా ముందుకెళ్లాలా అని తలలు పట్టుకుంటున్నారు.

నాని ఫిర్యాదు మేరకు ఐపీసీ 420, 415, 416, 468, 499 రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేశారు. తీరా ఆరా తీస్తే నాని తమ్ముడే కావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇటీవల కాలంలో నాని తమ్ముడు చిన్నికి పడటం లేదు. దీంతో ఎంపీ తన తమ్ముడిపైనే కేసు పెట్టడం గమనార్హం. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. కానీ కేసుల దాకా వెళ్లడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇద్దరు టీడీపీ నేతలే కావడం మరో ట్విస్ట్. ఈ నేపథ్యంలో అన్నదమ్ములు ఇలా రచ్చకెక్కడం టీడీపీకి నష్టమే అని తెలుస్తోంది.
ఆ కారు కేశినేని జానకిలక్ష్మి పేరు మీద ఉంది. ఆమె నాని తమ్ముడు చిన్న భార్య. దీంతో పోలీసులు దీనిపై ఏం చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. స్వయాన తమ్ముడే కావడంతో ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. కానీ నాని మాత్రం తమ్ముడైనా ఎవరైనా చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. కేశినేని రెండు సార్లు గెలవడంతో ఈసారి పార్టీలో సరిగా పాల్గొనడం లేదు. దీంతో తమ్ముడు చిన్న క్రియాశీలకంగా వ్యవహరిస్తూ టికెట్ తనకే కావాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే నాని చిన్నపై కక్ష పెంచుకున్నట్లు సమాచారం.

టీడీపీ మహానాడు కు కూడా హాజరు కాలేదు. దీంతో పార్టీలో నాని విధానంపై చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో సీటు ఎవరికైనా కేటాయిస్తారేమోననే ఉద్దేశంతోనే చిన్న పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో నాని తమ్ముకు చిన్నను ఇరుకున పెట్టాలనే ఇలా కేసు పెట్టినట్లు సమాచారం. ఏదిఏమైనా అన్నదమ్ముల మధ్య జరిగిన విభేదాలకు అందరిని ఎందుకు పరేషాన్ చేయడం అని పోలీసులు నచ్చజెప్పేందుకే ప్రయత్నిస్తున్నారు.