INS Arighaat: భారత్.. ప్రపచంలో అత్యధిక సైనిక శక్తి ఉన్న దేశాల్లో ముందు వరుసలో ఉంటుంది. మానవ వనరులతోపాటు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది. రష్యా మన ఆర్మీకి అవసరమైన అత్యాధునిక ఆయుధాలను సమకూరుస్తోంది. ఇక ఇండియన్ ఆర్మీ కూడా నిరంతరం శక్తిని ఆధునికీకరించుకుంటోంది. విదేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడంతోపాటు భారత్ కూడా స్వయంగా అయుధ సంపత్తిని తయారు చేసుకుంటోంది. తాజాగా భారత నౌకాదళం అమ్ములపొదిలో సరికొత్త అణు జలాంతర్గామి చేరింది. పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన దేశ తొలి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ అరిఘాత్’ భారత్ నౌకాదళం నిర్మించింది. దీనిని రక్షన మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు. అరిహంత్ మాదిరిగానే అరిఘాత్ నిర్మాణాన్ని సైతం తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధనౌకల స్థావరం విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులోని ‘షిప్ బిల్డింగ్ సెంటర్’లో 2011 డిసెంబరులో చేపట్టారు. తొలిదశ నిర్మాణం పూర్తయిన తర్వాత 2017 నవంబరు 19వ తేదీన జలప్రవేశం చేయించారు. అనంతరం అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని సమకూర్చడం వంటి కీలక పనులన్నింటినీ ఇప్పటికే పూర్తి చేశారు. సీ ట్రయల్స్ ప్రక్రియను సైతం పలు దఫాలుగా చేపట్టారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆగస్టు 29వ తేదీన విశాఖకు వచ్చి అరిఘాత్‌ను జాతికి అంకితం చేశారు.
ఐఎన్‌ఎస్ అరిఘాత్ ప్రత్యేకతలు..
అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్ పొడవు 111.6 మీటర్లు ఉంటుంది. అదే విధంగా వెడల్పు 11 మీటర్లు కాగా, లోతు(డ్రాఫ్ట్) 9.5 మీటర్లు. సముద్ర ఉపరితలంలో గంటకు 12 నుంచి 15 నాటికల్ మైళ్లు (22 నుంచి 28 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తుంది. సముద్ర జలాల్లో 24 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఐఎన్‌ఎస్ అరిఘాత్‌లో రేడియేషన్ బయటకు పొక్కకుండా భత్రతా ఏర్పాట్లు చేశారు. ఇది సోనార్ కమ్యునికేషన్ వ్యవస్థ, సాగరిక క్షిపణుల వ్యవస్థ కలిగి ఉంది.
ఫిబ్రవరిలో ’ఐఎన్‌ఎస్ సంధాయక్’..
ఇదిలా ఉంటే.. ఐఎన్‌ఎస్ సంధాయక్ సర్వే నౌకను ఈ ఏడాది పిబ్రవరిలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. హిందూ మహాసముద్ర జలాల్లో శాంతిని కాపాడేందుకు ఐఎన్‌ఎస్ సంధాయక్ ఉపకరిస్తుందని వివరించారు. దేశీయంగా యుద్ధ నౌక తయారీలో చరిత్ర సృష్టించడం ఆనందంగా వుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజినీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ ‘ఐఎన్‌ఎస్ సంధాయక్’ను నిర్మించింది. 2021 వరకు కొనసాగిన సంధాయక్ నౌక స్థానంలో, ఈ కొత్త నౌకను ఉపయోగించనున్నారు. అంతర్జాతీయ ప్రాదేశిక మాపింగ్ కోసం దీనిని వినియోగిస్తారు. 110 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు, 4,130 టన్నుల బరువు, 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ నౌక , 3.2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The defense minister is all set to launch indias second nuclear powered submarine at visakhapatnam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com