కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 18,38,490 నమూనాలు పరీక్షించగా కొత్తగా 43,071 కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు రోజుతో పోల్చితే 2 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,45,433కు పెరిగింది. ఇప్పటివరకు జరిగిన టెస్టుల సంఖ్య 41.28 కోట్లకు చేరింది.
గడిచిన 24 గంటల్లో 955 మంది మహమ్మారి కాటుకు బలయ్యారు. కిందటి రోజుతో పోల్చుకుంటే నిన్న దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య పెరిగింది. దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 4,02,005కు చేరింది. నిన్న ఒక్క రోజే 52,299 మంది కొవిడ్ నుంచి కోలుకోగా రికవరీల సంఖ్య 2,96,58,078కి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 97.09 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 4,85,350గా ఉంది. జూన్ 21 నుంచి దేశంలో నాలుగో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఇప్పడి వేగంగా సాగుతోంది. నిన్న ఒక్క రోజే 63,87,849 మందికి టీకాలు అందజేశారు. అంతా కలిసి ఇప్పటి వరకు35,12,306 టీకా డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.