YS Jagan: ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంటున్నాయి. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తమ ప్రభుత్వం ఏ వర్గం వ్యతిరరేకంగా ఉందో.. వారిని క్రమంగా పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలకు అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీలు నెరవేర్చమని ఆందోళన చేసిన సంఘాలపైనే పోలీసులదో దాడి చేయించారు. చర్చలు జరిపేందుకు కూడా నిరాకరించారు. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీచర్లు తమపై ఆగ్రహంగా ఉన్నారని గుర్తించిన జగన.. వారిని ఎన్నికల విధుల్లో ఉంచితే.. తనకు ఓటమి తప్పదని గ్రహించారు. ఎన్నికల్లో టీచర్ల ప్రభావం అధికంగా ఉంటుందని తేలడంతో హఠాత్తుగా బోధనేతర విధుల నుంచి టీచర్లకు మినహాయింపునిస్తూ జగన్ సర్కార్ ఆర్డినెన్స్ రెడీ చేసింది.

నేతల్లో సంతోషం.. ఉద్యోగుల్లో ఆగ్రహం..
నిజానికి ప్రభుత్వంపై ఉద్యోగులందరూ జగన్ సర్కార్‌పై ఆగ్రహంతోనే ఉన్నారు. ఉద్యోగ సంఘం నేతలు మాత్రమే కాస్త సంతోషంగా ఉన్నారు. ఆ నేతలు పనులు చేసేవాళ్లు కాదు. ఉద్యోగమే చేయరు. విధులే నిర్వహించరు. టీచర్లు వ్యతిరేకంగా ఉన్నారని వారిని ఎన్నికలకు విధులకు దూరం చేశారు. మరి మిగతా ఉద్యోగుల్ని ఏం చేస్తారో?
టీచర్ల ప్రభావం ఎక్కువ..
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికలను టీచర్లు నిర్వహించినంత సమర్థవంతంగా మిగత ఏ విభాగం కూడా నిర్వహించదు. ఓటరు నమోదు, జనాభా లెక్కలు, ఇతర సర్వేలతోపాటు ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎన్నికల సంఘాలు టీచర్లకే అప్పగించేవి. సక్సెస్‌ఫులగా ఎన్నికలు నిర్వహించేవి. అయితే కొన్నేళ్లుగా ఎన్నికల ఫలితాలపై కూడా వీరు ప్రభావం చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణులు, నిరక్షరాస్యులను పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వీరు సహకరిస్తున్నారు. ఈ క్రమంలో తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు, ప్రభుత్వాలను ఓడించడంలో వీరు కీలకంగా మారుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడానికి ఉపాధ్యాయులు, ఉద్యోగులే కారణం అన్నది వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించిన ఏపీ సీఎం జగన్.. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించడమే ఉత్తమమని నిర్ణయించారు.
ప్రజలనైనా ఓటు వేయనిస్తారా?
ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను అధికారం ఉందికదా అని నయానో, భయానో ఎన్నికల విధులకు దూరం చేస్తున్న జగన్ మరి ఆయన పాలనతీరుపై రగిలిపోతున్న ప్రజలనూ ఓట్లకు దూరం చేస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అలాంటప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వాలంటీర్ల ద్వారా బెదిరించి..
ప్రభుత్వానికి ఓట్లు వేస్తారనుకున్న వారిని మాత్రమే ఓటింగ్‌కు రావాలని మిగతా వారు రాకూడదని జగన్ అనధికారిక నిబంధన అమలు చే స్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవంగా ఏపీ సర్కార్‌పై అన్నివర్గాల్లో అసంతృప్తి ఉంది. ఎందుకంటే పాలన ఆవిధంగా చేస్తున్నారు జగన్. ఓటు బ్యాంక్‌కు ఇంటికి రూ.పది వేలు చొప్పున ఇస్తున్నా కాబట్టి తమకే ఓట్లేస్తారని తెగ అనుకుంటున్నారు.. కానీ ఆ నమ్మకం వారికే లేదు. అందుకే అన్ని రకాల తప్పుడు మార్గాలనూ అన్వేషిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల విధుల్లో టీచర్లే ఎక్కువగా ఉంటారు. ఎన్నికలు సాధారణంగా స్కూళ్లకు సెలవులు ఉన్న సమయంలో జరుగుతాయి. ఉపఎన్నికలు.. ఇతర ఎన్నికలు స్కూల్స్ నడుస్తున్న సమయంలో జరిగితే.. సెలవు ఇస్తారు. సుదీర్ఘకాలంగా ఎన్నికలు అంటే తొలుత టీచర్లే గుర్తుకువచ్చేలా వారిని వినియోగించుకుంటున్నారు. ఓట్ల జాబితాల పరిశీలన నుంచి ఎన్నికల రోజు ఓటింగ్ వరకు వారే ఉంటారు. టీచర్లు లేకపోతే ఎన్నికల నిర్వహణ కష్టం అయిపోతుంది. విషయం ఏమిటంటే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే వారు ప్రభుత్వ ఉద్యోగులేనా అన్న డౌట్ వారికీ ఉంది. ప్రభుత్వం అలా ట్రీట్ చేస్తోంది మరి!