Covid Deaths : : కోవిడ్–19 : ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన మహమ్మారి కరోనా. సుమారు నాలుగు వేవ్‌లలో ఈ వైరల్‌కు లక్షల మంది బలయ్యారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వైరస్ బారినపడ్డారు. కొందరు ఇంట్లోనే కోలుకోగా, కొందరు ఆస్పత్రిలో చికిత్స తర్వాత కోలుకున్నారు. చైనాలోని వూహాన్‌లో పుటిన ఈ వైరస్.. వేగంగా వ్యాప్తి చెందింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో రెండోస్థానంలో ఉన్న చైనాలో అయితే ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. మహమ్మారి కారణంగా ఒకరిని ఒకరు చూసుకోలేని పరిస్థితి. ఆప్యాయంగా పలకరించుకునే పరిస్థితి లేదు. సోషల్ డిస్టెన్స్, లాక్‌డౌన్‌తో వైరస్ కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. ఇక వైరస్ నియంత్రణకు అమెరికా, రష్యా, చైనాతోపాటు భారత్ కూడా వ్యాక్సిన్లు తాయారు చేశాయి. వేగంగా వ్యాక్సినేషన్ చేపట్టాయి. దీంతో క్రమంగా వైరస్ వ్యాప్తం తగ్గింది. దాదాపు నాలుగు వేవ్‌లలో వైరస్ అన్నిదేశాల్లోనూ ప్రభావం చూపింది. ఇప్పటికీ కోవిడ్ వాప్తి ఉన్నప్పటికీ.. గతంలోలాగా ప్రభావం చూపడం లేదు. రూపాన్ని మార్చుకుంటూ వైరస్ అన్ని వైరస్‌లలాగానే వచ్చి పోతోంది.
మరణాలపై పరిశోధన..
ఇక కోవిడ్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అనేక సంస్థలు పరిశోధనలు చేశాయి. మరోవైపు ప్రభుత్వాలు కూడా మరణాల సంఖ్యతోపాటు, వైరస్ బాధితుల రిపోర్టును ఏరోజుకు ఆరోజు ప్రకటించాయి. చైనా మాత్రమే తమ దేశంలో మరణాలు, బాధితుల లెక్కను ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా లండన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో కోవిడ్ కారణంగా ఎక్కువ మరణాలు భారత్‌లోనే సంభవించినట్లు ప్రకటించింది. భారత్‌లో అధికారిక మరణాలకన్నా.. 8రెట్లు ఎక్కువ మరనాలు సంభవించాయని ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్ లెక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కన్నా 1.5 రెట్లు ఎక్కువ అని పేర్కొంది.
కొట్టి పారేసిన కేంద్రం..
కేంద్రం ఆక్ఫ్‌ర్డ్ నివేదికను కొట్టిపారేసింది. ఈ రిపోర్టుపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. సైన్స్ అడ్వాన్సెస్ పేపర్‌లో నివేదించబడిన అదనపు మరణాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని తెలిపింది. జర్నరల్స్‌లో లోపభూయిస్టంగా ఉందని పేర్కొంది. ఆమోదయోగ్యంగా లేదని తెలిపింది. ప్రామాణికత లేని నివేదికను పట్టించుకోవాల్సిన పనిలేదని పేర్కొంది.
డబ్ల్యూహెచ్‌వో నివేదిక ఇలా..
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం కోవిడ్ కారణంగా భారతత్‌లో 4.7 మిలియన్ల మంది మరణించారు. ఇక భారత్ అధికారిక లెక్కల ప్రకారం 2020, 2021 మధ్య 4.8 లక్షల మంది మరణించారు. రష్యాలో1.07 మిలియన్లు, ఇండోనేషియాలో 1.03 మిలియనుల, అమెరికాలో 0.93 మిలియన్లు, బ్రెజిల్‌లో 0.68 మిలియన్లు. మెక్సికోలో 0.63 మిలియన్లు, పెరూలో 0.29, టర్కీలో 0.26 మిలియన్లు, ఈజిప్ట్‌లో 0.25, సౌత్ ఆఫ్రికాలో 0.24 మిలియన్ల మంది మరణించారు. అయితే ఆక్స్‌ఫర్డ్ నివేదిక ప్రకారం.. డబ్ల్యూహెచ్‌వో నివేదిక కాన్న కనీసం మూడు రెట్లు ఎక్కువగా చూపింది.
పరిశోధనపై అనుమానాలు..
ఇదిలా ఉంటే ఆక్ట్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశోధన చేయకుండా.. ప్రభుత్వ లెక్కలను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీంగా ఎలాంటి ఆధారాలు సేకరించకుండా ఉన్న లెక్కలనే మూడు నాలుగు రెట్లు పెంచి నివేదిక రూపొందించినట్లు ఉందని ప్రపంచ దేశాల నిపుణులు పేర్కొంటున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The death toll of covid is high in india the indian government has condemned the oxford report
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com