CM Jagan- BJP: ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు రానున్నాయి. కేంద్రం ఏపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాదిలో మంచి ఫలితాలు రావనే సంకేతాలు వెలువడుతున్న సందర్భంలో దక్షిణాదిపై ఆధారపడక తప్పదని భావిస్తోంది. ఇందు కోసమే ఈ ప్రాంతాలపై ప్రత్యేకంగా ప్రేమ కురిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాట్లలో తలమునకలైన నేపథ్యంలో బీజేపీ తన పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. అందుకే ఏపీని తన దారిలో ఉంచుకోవాలని భావిస్తోంది.
ప్రస్తుతం ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీకి చేదు అనుభవమే మిగులుతుందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో మార్చి 10న ఫలితాలు రానున్నందున ఆంధ్రప్రదేశ్ ను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని భావిస్తోంది. ఎన్నికల ఫలితాల తరువాత ఉత్తరాదిలో కూడా భారీ మార్పులు జరగనున్న సందర్భంలో దక్షిణాదిని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: ‘సన్నాఫ్ ఇండియా’ 5 రోజుల కలెక్షన్స్ !
ఏపీకి ఇంతవరకు ఎటువంటి ప్రయోజనాలు దక్కలేదు. దీంతో ప్రతిసారి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి విన్నపాలు చేయడం తప్ప ఒరిగిందేమీ లేదు. దీంతో ఏపీకి విభజన హామీలు అమలు చేసి తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. యూపీ, పంజాబ్ లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలు సూచిస్తున్నాయి. దీంతో బీజేపీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించనుంది.
రాబోయే ఎన్నికల్లో బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ రాదని తెలుసుకున్న పార్టీ భవిష్యత్ లో కష్టాలు రాకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు జగన్ ను తమకు అనుకూలంగా ఉంచుకోవాలని తలపిస్తోంది. ఇందులో భాగంగా ఏపీకి రావాల్సిన బకాయిలు విడుదల చేసి విభజన హామీలు కూడా నెరవేర్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇదే జరిగితే ఇక ఏపీకి అన్ని శుభ శకునాలే అని తెలుస్తోంది. దక్షిణాదిలో అత్యధిక ఎంపీలు ఉన్న రాష్ట్రం కావడంతో జగన్ తో సత్సంబంధాలు కొనసాగించాలని చూస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు వెచ్చించి అక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు గాను ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రెడీ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మూడో కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో తలమునకలైన నేపథ్యంలో బీజేపీ తన జాగ్రత్తల్లో తాను ఉంటోంది. దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలను దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా జగన్ తో స్నేహపూర్వకంగా ఉండటమే మేలని అనుకుంటోంది. అందుకే ఏపీకి వరాలు ఇచ్చేందుకు కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది.
Also Read: సినిమా టికెట్ల వ్యవహారం: జగన్ ను ఆ ఒక్కమాటతో కడిగేసిన పవన్ కళ్యాణ్