https://oktelugu.com/

AP People : ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన కేంద్రం..!

  AP People : కేంద్రం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. ఎన్నో ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న కీలకమైన ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ లైన్ క్లియర్ చేయడంతో ఆ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు కలుగనుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాష్ట్రంలోని గుత్తి – పెండేకల్లు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న లైనును డబుల్ లైన్ గా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 24, 2023 11:22 pm
    Follow us on

     

    AP People : కేంద్రం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. ఎన్నో ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న కీలకమైన ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ లైన్ క్లియర్ చేయడంతో ఆ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు కలుగనుంది.

    దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాష్ట్రంలోని గుత్తి – పెండేకల్లు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న లైనును డబుల్ లైన్ గా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా అంగీకరించింది. ఈ రెండు రైల్వేస్టేషన్లో మధ్య దూరం 29.2 కిలోమీటర్లు. డబ్లింగ్ పనులు చేపట్టేందుకు రూ.352 కోట్ల వరకు కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు అధికారులు పూర్తి వివరాలను తెలిపారు.

    అత్యంత ముఖ్యమైన లైన్..

    దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని గుంతకల్ డివిజన్ కు సంబంధించి గుత్తి – పెండేకల్లు సెక్షన్ అత్యంత ముఖ్యమైనది. హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్లే రైళ్లు అన్ని ఈ మార్గం గుండానే ప్రయాణిస్తాయి. ఈ రెండు మెట్రోపాలిటన్ నగరాలకు చెందినవారు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ మార్గమే కీలకమైనది. ప్యాసింజర్ రైళ్లు, సరుకు రవాణా రైళ్ల నిర్వహణలో మంచి వృద్ధి ఉండడంతో ఇక్కడ అభివృద్ధి పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    డబ్లింగ్ చేయడం వలన రాకపోకలు సులభం..

    ఈ మార్గాన్ని డబ్లింగ్ చేస్తే రాకపోకలు కూడా సులభం కానున్నాయి. దీనివల్ల మరిన్ని ఎక్కువ రైళ్లను నడపడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణికులకు కూడా ఎదురుచూపులు తగ్గడంతో పాటు వారి రవాణా కష్టాలన్నీ తీరిపోయేందుకు అవకాశం ఉంటుంది. అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని డబ్లింగ్ చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు. గుంతకల్లు నుంచి గుంటూరు వరకు ఉన్న మార్గాన్ని డబ్లింగ్ చేసే ప్రాజెక్టులో కూడా పురోగతి కనపడింది. ఈ పనులను కూడా రైల్వే శాఖ ఆమోదించింది. ఈ పనులు కూడా ఎప్పటికీ పురోగతిలో ఉన్నాయి.

    డబుల్ లైన్ సెక్షన్ గా మార్పు..

    ఇక మరో కీలకమైన సెక్షన్ గుత్తి – ధర్మవరంను కూడా ఇటీవల డబుల్ లైన్ సెక్షన్ గా మార్చారు. దీనివల్ల ఈ ప్రాంతాలకు చెందిన వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడినట్లు అవుతుంది. సరుకు రవాణా రైళ్లు కూడా వేగంగా సరుకులను చేరవేయడానికి వీలు కలుగుతుంది. ఎక్కడకు సమీపంలోని పరిశ్రమలకు కూడా ప్రయోజనం దక్కుతుందని భావిస్తున్నారు. రైళ్ల సగటు వేగం పెరగడం వల్ల ప్రయాణికులకు చాలా సమయం ఆదా కానుంది.