Central Government : కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజల కోసం చాలా స్కీం లను అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కొన్ని స్కీం లను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేశాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకాన్ని ప్రజల కోసం అమలు చేయనుంది. దీని ద్వారా ఏకంగా రూ. 78 వేలు ఉచితంగా పొందవచ్చు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూర్య ఘర్ తో ప్రతి ఇంటికి ఆర్థిక స్వావలంబన ఏర్పడుతుందని తెలిపారు. జిల్లాలోని సచివాలయంలో శుక్రవారం రాత్రి సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్డీవోలు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి పథకంతో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, అలాగే డిఆర్ఓ కె మోహన్ కుమార్ తో కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి పథకంతో ఆర్థిక స్వావలంబన వెలుగులు ఉండాలని అలాగే ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని తెలిపారు. ఈ పథకంలో ఇంటి పైకప్పు మీద రూ.2 లక్షల విలువైన 3 కే డబ్ల్యు సోలార్ ప్యానెల్ ను రూ. 78 వేల రాయితీతో ఏర్పాటు చేసుకోవచ్చు అని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇందులో రూ. 20 వేల రూపాయలు లబ్ధిదారు వాటా పోను మిగిలిన మొత్తాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకు నుంచి రుణంగా పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ విధంగా 20 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ పొందవచ్చు అన్నారు. అవసరాలకు సరిపడిన విద్యుత్ను ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన సౌర విద్యుత్ను గ్రిడ్ కు ఇవ్వడం ద్వారా ప్రతి యూనిట్ కు రూ. 2.09 ఆదాయం పొందవచ్చని చెప్పుకొచ్చారు.
ఈ పథకం కింద ఉచితం గా విద్యుత్ పొందడమే కాకుండా ఉపయోగించుకొని మిగిలిన విధ్యుత్ ను గ్రిడ్ కు ఇవ్వడం ద్వారా ఆదాయం కూడా పొందవచ్చని తెలుస్తుంది. ఎస్సి,ఎస్టీ ప్రజలకు ఇప్పటి వరకు ఉచితం గా 200 యూనిట్ లు విధ్యుత్ లభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పొందుతున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు సూర్య ఘర్ పథకం కింద సౌర విద్యుత్ ప్యానెల్లను ఉచితంగా ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సొంత ఇల్లు మరియు విద్యుత్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సూర్య ఘర్ ఆన్లైన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
సొంత ఇల్లు ఉన్న వారు ఈ సూర్య ఘర్ పథకం కోసం తమ ఇంటి దగ్గర నుంచే అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ లో భాగంగా అవసరమైన ప్రభుత్వ భూమిని గుర్తించే ప్రక్రియను తహసీల్దారులు చేపట్టాలని తెలిపారు.సూర్య ఘర్ పథకాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలి అని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు.