అన్నదాతలకు తీపికబురు చెప్పిన మోడీ సర్కార్

పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులతో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు రైతుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రైతు వ్యతిరేక ముద్ర పడకుండా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వ్యవసాయ బిల్లుల ఆమోదంతో అన్నదాతల ఆగ్రహాలు పెల్లుబుకాయి. నిన్న పంజాబ్, హర్యానాల్లో ఈరోజు బెంగళూరు, కర్ణాటకలో రైతులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. దీంతో దెబ్బకు మోడీ సర్కార్ దిగి వచ్చింది. తాజాగా కేంద్రం ఆరు రబీ పంటలకు కనీస […]

Written By: NARESH, Updated On : September 21, 2020 8:21 pm
Follow us on

పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులతో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు రైతుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రైతు వ్యతిరేక ముద్ర పడకుండా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే వ్యవసాయ బిల్లుల ఆమోదంతో అన్నదాతల ఆగ్రహాలు పెల్లుబుకాయి. నిన్న పంజాబ్, హర్యానాల్లో ఈరోజు బెంగళూరు, కర్ణాటకలో రైతులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. దీంతో దెబ్బకు మోడీ సర్కార్ దిగి వచ్చింది.

తాజాగా కేంద్రం ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లోక్ సభలో ఒక ప్రకటన చేయడం విశేషం.

ఈ సందర్భంగా కనీస మద్దతు ధరను తొలగించనున్నారంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారమని ఈ ప్రకటనతో తేలిపోయిందని తోమర్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధర ఈ క్రింది పంటలకు పెంచారు.

*బార్లీ : 75 రూపాయల పెరుగుదల
*కుసుమ : 112 రూపాయల పెరుగుదల
*ఆవాలు : 225 రూపాయల పెరుగుదల
*శనగపప్పు : 225 రూపాయల పెరుగుదల
*ఎర్రపప్పు : 300 రూపాయల పెరుగుదల
* గోధుమ : 50 రూపాయల పెరుగుదల

Also Read : ఏపీ ప్రభుత్వం సంచలనం.. దమ్మాలపాటిపై సుప్రీంకు..