https://oktelugu.com/

మోదీకి ట్వీటర్లో కేటీఆర్ కౌంటర్

కేంద్రంలోని మోడీ సర్కార్ పార్లమెంటులో వ్యవసాయ సంస్కరణల పేరిట మూడు బిల్లులను తాజాగా ఆమోదించింది. ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. రాజ్యసభలో 8మంది సభ్యులను సస్పెండ్ చేసి మరీ ముజువాణి ఓటుతో మోదీ సర్కార్ బిల్లులను పాస్ చేయించుకుంది. దీనిపై విపక్షాలు రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాయి. దీంతో ఈ బిల్లులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన రైతుల ఉత్పత్తుల వర్తక వాణిజ్యం (ప్రోత్సాహం సదుపాయకల్పన) బిల్లు-2020.. ధరల హామీ పంట సేవల అంగీకార బిల్లు-2020.. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 21, 2020 11:21 pm
    Follow us on

    కేంద్రంలోని మోడీ సర్కార్ పార్లమెంటులో వ్యవసాయ సంస్కరణల పేరిట మూడు బిల్లులను తాజాగా ఆమోదించింది. ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. రాజ్యసభలో 8మంది సభ్యులను సస్పెండ్ చేసి మరీ ముజువాణి ఓటుతో మోదీ సర్కార్ బిల్లులను పాస్ చేయించుకుంది. దీనిపై విపక్షాలు రాజ్యసభ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాయి. దీంతో ఈ బిల్లులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

    కేంద్రం ప్రవేశపెట్టిన రైతుల ఉత్పత్తుల వర్తక వాణిజ్యం (ప్రోత్సాహం సదుపాయకల్పన) బిల్లు-2020.. ధరల హామీ పంట సేవల అంగీకార బిల్లు-2020.. నిత్యావసర ఉత్పత్తుల(సవరణ) బిల్లు-2020లకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. విపక్షాల ఆందోళనల మధ్యే ఈ బిల్లులు ఆమోదం పొందాయి. కాగా  ఈ బిల్లులను బీజేపీ మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించడం గమనార్హం.

    Also Read : టీటీడీపీ మార్పు ఖాయమా.. బాబు ఆలోచన ఏంటీ?

    వ్యవసాయం సంస్కరణల పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ ట్వీటర్లో స్పందించారు. రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఈ మూడు బిల్లులు దేశంలోని వ్యవసాయరంగంలో చరిత్రాత్మకమైనవని కొనియాడారు. దేశంలోని కోట్లాదిమంది అన్నదాతలకు ఈ బిల్లుల ద్వారా లబ్ధి చేకూరుతుందంటూ మోదీ ట్వీట్ చేశారు.

    పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించడాన్ని తెలంగాణ బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీని.. తెలంగాణ బీజేపీ నేతలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీటర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సర్కార్ ప్రవేశ పెట్టిన వ్యవసాయరంగ బిల్లులు నిజంగా చరిత్రాత్మకమే అయితే…దేశవ్యాప్తంగా రైతులు ఎందుకు సంబరాలు చేసుకోవడం లేదంటూ ప్రశ్నించారు.

    ఈ బిల్లులు రైతులకు మేలుచేసేవే అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నాయని ప్రశ్నించారు. ప్రధాని ట్వీట్ కు కేటీఆర్ రీ ట్వీట్ చేస్తూ లేవనెత్తిన ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు తెలంగాణ బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే..!