Homeజాతీయ వార్తలుLPG Gas Cylinder Price: ఒక్కో సిలిండర్ పై 400 తగ్గింపు. వారికి మాత్రమే!

LPG Gas Cylinder Price: ఒక్కో సిలిండర్ పై 400 తగ్గింపు. వారికి మాత్రమే!

LPG Gas Cylinder Price: మోదీ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. కేంద్ర కేబినెట్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

డొమెస్టిక్‌పై రూ.200లే..
డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఏకంగా రూ.200 తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రూ.200 తగ్గింపు అనేది సబ్సిడీ రూపంలో ఉంటుంది. అంటే ప్రభుత్వమే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు రూ.200 సబ్సిడీ మొత్తాన్ని అందిస్తుంది. సిలిండర్‌ ధర తగ్గింపు బెనిఫిట్‌ మాత్రం వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

ఉజ్వల కనెక్షన్లకు రూ.400 తగ్గింపు..
కేంద్ర ప్రభుత్వపు తాజా సిలిండర్‌ ధర తగ్గింపు వల్ల సిలిండర్‌ వినియోగదారులకు రూ.200 తగ్గింపు లభిస్తే.. కొందరికి మాత్రం ఏకంగా రూ. 400 తగ్గింపు అందుబాటులో ఉంటుంది. ఉజ్వల స్కీమ్‌ వారికి గ్యాస్‌ సిలిండర్‌పై రూ.400 డిస్కౌంట్‌ అందుబాటులో ఉండనుంది. మోదీ సర్కార్‌ ఇప్పటికే ఉజ్వల స్కీమ్‌ కింద గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు రూ.200 సబ్సిడీ అందిస్తోంది. అంటే ఇప్పుడు మరో రూ.200 తగ్గింపు అంటే మొత్తంగా ఉజ్వల స్కీమ్‌ లబ్ధి పొందే వారికి రూ. 400 తగ్గింపు వస్తుందని చెప్పుకోవచ్చు. దీని వల్ల సామాన్యులకు భారీ ఊరట కలుగుతుంది. 2023 మార్చి నెలలో రూ.200 సబ్సిడీ బెనిఫిట్‌ను ఉజ్వల స్కీమ్‌ లబ్ధిదారులకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు తాజాగా మరో రూ.200 తగ్గింపు ప్రకటించింది. సిలిండర్‌ ధర రూ.200 తగ్గుతుంది. రూ.200 సబ్సిడీ రూపంలో వినియోగదారుల బ్యాంక్‌ అకౌంట్లలో జమ అవుతుంది. ఇలా వారికి రూ.400 తగ్గింపు వస్తుంది.

సిలిండర్‌ ధరలు ఇలా..
ప్రస్తుతం సిలిండర్‌ ధరలను గమనిస్తే.. ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ. 1,053గా ఉంది. ముంబైలో అయితే 1,052గా సిలిండర్‌ ధర కొనసాగుతోంది. చెన్నైలో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1,068గా ఉంది. కోల్‌కతాలో రూ. 1,079గా ఉంది. అంటే సిలిండర్‌ ధరలు ఎక్కడ చూసినా రూ.1000కు పైనే ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
మన తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే.. గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తతం రూ.1,160 వద్ద కొనసాగుతోంది. ఇది ఎక్కువ రేటు అని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పైస్థాయిలోనే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తగ్గింపు తర్వాత చూస్తే.. ఇకపై ప్రజలకు సిలిండర్లు రూ.960కే లభిస్తాయని చెప్పుకోవచ్చు.

ఉజ్వలతో అందరికీ వంటగ్యాస్‌..
గ్యాస్‌ సిలిండర్‌ అందరికీ అందుబాటులో ఉంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీమ్‌ను తీసుకువచ్చింది. 2016 మే నెలలో ఈ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ స్కీమ్‌ కింద అర్హత కలిగిన వారు డిపాజిట్‌ లేకుండానే ఎల్‌పీజీ కనెక్షన్‌ పొందొచ్చు. దారిద్య్ర రేఖకు దిగువున్న ఉన్న వారికి ఈ బెనిఫిట్‌ లభిస్తుంది. ఈ స్కీమ్‌ కింద లభించే సబ్సిడీ మొత్తం నేరుగా గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular