
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన రిజిస్ర్టేషన్ల ప్రక్రియ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బ్యాంకర్లలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ర్టేషన్ల ప్రక్రియను వారికి వివరించారు. బ్యాంకర్లకున్న అనుమానాలను కూడా ఆయన నివృత్తి చేశారు. ఈసందర్భంగా సీఎస్ సోమేశ్‌కుమార్ బ్యాంకర్లకు ప్రత్యేకంగా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. బ్యాంకింగ్, మార్టిగేజ్ విధానాలన విరించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న మాడ్యుల్స్ ఎంతో పారదర్శకంగా ఉన్నాయని వారు ప్రశంసించారు.