
కథానాయకులకే కాదు ప్రతినాయకులకు కూడా అభిమానులుంటారు. మనం తెర మీద కేవలం హీరోలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుసు. కానీ నిజ జీవితంలో కూడా హీరోలా ప్రవర్తిస్తున్న సినీనటుడు సోనూసూద్ కు ప్రత్యేక అభిమానులున్నారు. సరదాగా దూకుడు సినిమాలో వచ్చే సన్నివేశాల్ని చూస్తున్న ఓ కుర్రాడు హీరో విలన్ ను కొట్టే దృశ్యాలను చూసి ఆవేశంతో ఊగిపోయాడు. ఆవేశాన్ని ఆపుకోలేక టీవీనే పగులగొట్టాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. సోనూసూద్ అన్ని పాత్రల్లో నటించారు. ఎక్కువగా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలే కావడంతో ఆయనకు ఎక్కువ అలాంటి పాత్రలే వస్తున్నాయి.
కరోనా కష్టకాలంలో మాత్రం సోనూసూద్ చేసిన సేవలను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. కేరళలో విద్యార్థుల నెట్ సదుపాయం కోసం ఓ సెల్ టవర్ నిర్మాణం చేసి తనలోని దాతృత్వాన్ని చాటాడు. దీంతో సినిమాలో ఎలా ఉన్నా నిజజీవితంలో మాత్రం నిజంగా హీరోలా మారాడు సోనూసూద్. అన్ని రకాల సహాయాలు చేయడంతో అభిమానులు కూడా పెరిగిపోయారు. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు సోనూసూద్ కు హార్ట్ కోర్ ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇటీవల హైదరాబాద్ లో ఓ పిల్లాడు సోనూసూద్ పై చూపించిన ప్రేమ ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ గా మారింది.
సంగారెడ్డి జిల్లాకు చెందిన న్యాల్కల్ లోని విరాట్ అనే కుర్రాడు రీసెంట్ గా టీవీ షోలో సినిమా చూస్తూ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు.దూకుడు సినిమాలో హీరో మహేశ్ బాబు విలన్ సోనూసూద్ ను కొట్టే సన్నివేశాలను చూసిన అతడు ఒక్కసారిగా బయటకు వెళ్లి బండరాయి తెచ్చి టీవీపై విసిరాడు. దీంతో టీవీ ముక్కలైంది. కొవిడ్ కష్టకాలంలో ఎంతో మందికి సేవ చేసిన సోనూసూద్ ను అలా కొట్టడం బాలుడికి నచ్చలేదు. అందుకే టీవీ పగులగొట్టినట్లు చెప్పడంతో ఆశ్చర్యపోయారు.