YCP Leaders: వైసీపీ నేతల విషయంలో పోలీసుల తీరు షరా మాములే..!

YCP Leaders: ‘చట్టం ఎవరికీ చుట్టం కాదు.. చట్టం ముందు అందరూ సమానమే’. దీనిని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అయితే ఏపీ పోలీసులు వైసీపీ నేతల విషయంలో వ్యవహరిస్తున్న తీరు మాత్రం పలు విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నాయకుల విషయంలో ఒకలా, విపక్ష పార్టీలు, సామాన్యుల విషయంలో పోలీసులు మరోలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక నేతలంతా దూకుడు మంత్రాన్ని జపిస్తున్నాయి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం […]

Written By: NARESH, Updated On : December 22, 2021 4:56 pm
Follow us on

YCP Leaders: ‘చట్టం ఎవరికీ చుట్టం కాదు.. చట్టం ముందు అందరూ సమానమే’. దీనిని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అయితే ఏపీ పోలీసులు వైసీపీ నేతల విషయంలో వ్యవహరిస్తున్న తీరు మాత్రం పలు విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నాయకుల విషయంలో ఒకలా, విపక్ష పార్టీలు, సామాన్యుల విషయంలో పోలీసులు మరోలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

YCP Leaders

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక నేతలంతా దూకుడు మంత్రాన్ని జపిస్తున్నాయి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం కామన్. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయాలు మాటల స్థాయిని దాటిపోయాయి. ఇటీవల కాలంలో వైసీపీ నేతల అనుచరులు భౌతిక దాడులు, హత్యలకు సైతం పాల్పడుతుండటం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఈ విషయంలో మిన్నకుండిపోతుండటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో డాక్టర్ సుధాకర్ విషయంలోనూ పోలీసులు ఇలానే వ్యహరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనే సాకుతో అతడిపై కేసులు బనాయించి పిచ్చోడనే ముద్ర వేశారు. తనకు ప్రాణభయం ఉందని సుధాకర్ అప్పట్లో మెత్తుకున్న పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు.

చివరి అతడు గుండెపోటుతో మృతిచెందాడు. వైసీపీ నేతల కక్ష్య సాధింపు వల్లే సుధాకర్ మృతిచెందాడనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. అలాగే మాచర్లలో ఇద్దరు ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే స్థాయి నేతలపై వైసీపీ అనుచరులు హత్యాయత్నం చేస్తే పోలీసులు పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. వీడియో సాక్ష్యాలతో సహా దొరికిన దుండగులకు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు.

తాజాగా వైసీపీ నేత సుబ్బారావుపైనే మంత్రి అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుబ్బారావుపై దాడి చేయవద్దని మంత్రి సూచించిన ఆయన మాటను కూడా వినకుండా సుభాని అనే వ్యక్తి దాడి చేయడం కలకలం రేపింది. సుబ్బారావు గుప్తాపై దాడిని ఖండిస్తూ ఆర్యవైశ్య సంఘాలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపాయి.

ఈ ఇష్యూ పెద్దది అవుతున్న తరుణంలోనే రౌడీ షీటర్ సుభాని నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈక్రమంలోనే పోలీసులు అతడికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. సుబ్బారావుపై దాడి చేసిన వీడియోలు వైరల్ అవుతున్న క్రమంలోనే సుభానిపై అటెంప్ట్ మర్డర్ కింద కేసు బుక్ చేయాల్సిన పోలీసులు అతడికి సగౌరవంగా బెయిల్ ఇచ్చి పంపించడం వివాదాస్పదమవుతోంది.

Also Read: అన్ని పార్టీల్లా కాదు వైసీపీ.. ఇక్కడ నోరెత్తితే అంతే సంగతులు..!

పోలీసులు వైసీపీ నేతల విషయంలో ఒక విధంగా ఇతర పార్టీల విషయంలో, సామాన్యుల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారనే కామెంట్స్ విన్పిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేసే పోలీసులు భౌతిక దాడుల కేసుల విషయంలో ఎందుకు సరిగ్గా స్పందడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దీంతో పోలీసులు స్పష్టంగా ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళుతోంది. ఈ పద్ధతిని పోలీసులు మార్చుకోకుంటే మొత్తం డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకొని శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read: వైసీపీపై దాడికి రెడీ అయిన టీడీపీ మీడియా.. వెనుక భారీ ప్లాన్లు?