https://oktelugu.com/

ఈ జుట్టుపోలిగాడు ఎవ్వడండి ? వీడు వీడి ఓవర్ యాక్టింగ్

Kota Srinivasa Rao and Babu Mohan: బాబు మోహన్ హాస్య నటుడిగా అప్పుడే ఎదుగుతున్న రోజులు అవి. ముత్యాల సుబ్బయ్యగారి ‘మామగారు’ అనే సినిమా చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు – బాబు మోహన్ మధ్య కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తొలిరోజు షూటింగ్ మొదలైంది. అటు కోట శ్రీనివాసరావు, ఇటు బాబు మోహన్ ఒకరి వైపు చూసుకుంటున్నారు. కానీ మాటలు కలవలేదు. ముత్యాల సుబ్బయ్యగారితో అప్పటికే కోట శ్రీనివాసరావుకి మంచి అనుబంధం ఉంది. బ్రేక్ సమయంలో కోట.. […]

Written By:
  • Shiva
  • , Updated On : December 22, 2021 / 12:16 PM IST
    Follow us on

    Kota Srinivasa Rao and Babu Mohan: బాబు మోహన్ హాస్య నటుడిగా అప్పుడే ఎదుగుతున్న రోజులు అవి. ముత్యాల సుబ్బయ్యగారి ‘మామగారు’ అనే సినిమా చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు – బాబు మోహన్ మధ్య కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తొలిరోజు షూటింగ్ మొదలైంది. అటు కోట శ్రీనివాసరావు, ఇటు బాబు మోహన్ ఒకరి వైపు చూసుకుంటున్నారు. కానీ మాటలు కలవలేదు. ముత్యాల సుబ్బయ్యగారితో అప్పటికే కోట శ్రీనివాసరావుకి మంచి అనుబంధం ఉంది.

    Kota Srinivasa Rao and Babu Mohan

    బ్రేక్ సమయంలో కోట.. ముత్యాల సుబ్బయ్యగారి దగ్గర వెళ్లి ‘బాబు మోహన్’ను ఉద్దేశించి.. ‘సుబ్బయ్యగారు మీకు ఈ జుట్టుపోలిగాడు ఎక్కడ దొరికాడు అండి ?.. వీడు వీడి ఓవర్ యాక్టింగ్ ?’ అన్నాడు. ‘అదేంటయ్యా… వాడు మంచి నటుడయ్యా, పేరు బాబు మోహన్’. కోట దూరంగా ఉన్న బాబు మోహన్ ను పిలిచాడు. అలా వారి పరిచయం ఏర్పడింది. మొదటి రోజు నుంచి ఇద్దరి మధ్య మంచి అనుబంధం కుదిరింది.

    పైగా ఆ రోజుల్లో కామెడీ ట్రాక్స్ అన్ని వీరిద్దరి చుట్టే సాగేవి. దాంతో షూటింగ్ కి కూడా కలిసే వెళ్లి కలిసే వస్తూ ఉండేవారు. చాలా వరకు కలిసే ట్రావెల్‌ చేసేవాళ్లు. ఐతే ఓ రోజు ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. నిజానికి బాబు మోహన్‌ ఏ సినిమా చేసినా దాదాపు తన కారణంగానే ఆ సినిమా అవకాశం వచ్చిందని కోట అభిప్రాయం.

    అయితే, బాబూమోహన్ ఓ పెక్యూలియర్‌ టైమింగ్‌ ఉన్న కమెడియనే కాదు. మంచి ఆత్మాభిమానం ఉన్న నటుడు కూడా. దాంతో కోటగారి మాటలకు బాబు మోహన్ సీరియస్ అయ్యారు. కొన్ని రోజుల పాటు ఇద్దరి మధ్య మాటలు లేవు. కానీ, ఆ రోజుల్లో బాబు మోహన్ ను కోట గారి తన్నే సీన్ ఉండేది. అయితే, ఎప్పుడూ కోట గారు ఉత్తుత్తినే తన్నేవారు.

    Also Read: Dil Raju: అభిమానులంతా పరిస్థితి అర్థం చేసుకోవాలి-దిల్​రాజు

    కానీ, ఇద్దరి మధ్య గొడవ కారణంగా కోట గారు ఆ రోజు నిజంగానే తన్నారు. దాంతో 40 అడుగులు దొర్లుకుంటూ పడిపోయాడు బాబు మోహన్. దెబ్బకు కోటాలో వణుకు మొదలైంది. ఇప్పుడు ఎంత పెద్ద గొడవ అవుతుందో అని. అయితే, బాబు మోహన్ మాత్రం లేచి వచ్చి.. ‘అదేంటి అన్న అలా తన్నేశావ్ ?’ అంటూ వచ్చి నవ్వుతూ పక్కన కూర్చున్నాడు. టెన్షన్ లో ఉన్న కోట ఊపిరి పీల్చుకున్నాడు.

    Also Read: Sukumar: గురువు అంటే నీలా ఉండాలి… శభాష్ సుకుమార్!

    Tags