Jaish e Mohammed conspiracy: ఉగ్రవాదం.. ఈ ఉన్మాదమైన చర్యకు కేవలం మగవాళ్ళు మాత్రమే పాల్పడతారనే విషయం అందరికీ తెలుసు. ఉగ్రవాదులు కేవలం మగవాళ్ళు మాత్రమేనని.. వారు మాత్రమే అత్యంత కరుడుగట్టిన వ్యక్తిత్వంతో ఉంటారని.. సాటి మనుషులను అత్యంత దారుణంగా చంపేస్తారని అందరికీ తెలిసిందే. గతంలో జరిగిన సంఘటనలు.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా వీటినే నిరూపించాయి. ఇప్పుడు ఉగ్రవాదంలోకి ఆడవాళ్లు కూడా వస్తున్నారు. ముఖ్యంగా భారత్ అంటే తీవ్రస్థాయిలో మండిపడే జైష్ ఏ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఆడవాళ్లను ఉగ్రవాదులుగా మార్చుతోంది. వారిని వైట్ కాలర్ ఉగ్రవాదులుగా రూపొందించి మన దేశం మీదకి వదులుతోంది. ఢిల్లీ ఘటన తర్వాత.. మన దేశ పోలీసులు ఇద్దరు మహిళా టెర్రరిస్టులను అరెస్ట్ చేసిన తర్వాత దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
జై షే మహమ్మద్ సంస్థ భారత దేశంలో ఉగ్ర కార్యకలాపాలను మరింత విస్తరించడానికి మహిళలను రంగంలో విధించుతోంది. ఐసిస్, బోకో హారం, హమాస్, ఎల్టీటీఈ వంటి సంస్థలు ఆత్మహుతి దాడులకు మహిళలను ఉపయోగిస్తాయి. లష్కర్ ఏ తోయిబా, జై ష్ ఏ మహమ్మద్ వంటి సంస్థలు మాత్రం మహిళలకు ఇటువంటి అవకాశాన్ని ఇవ్వవు. వారిని కేవలం పడక సుఖం కోసం మాత్రమే ఉపయోగించుకుంటాయి. కానీ ఈసారి జై ష్ ఏ మహమ్మద్ అనే సంస్థ మాత్రం తన మార్గాన్ని మార్చుకుంది.. ఈ సంస్థ అధినేత మసూద్ అజర్ సోదరుడు తల్హా విభిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అతడి ఆదేశాల మేరకే యుద్ధ రంగంలోకి మహిళలను తీసుకోవడం మొదలుపెట్టారు.
ఉగ్ర కార్యకలాపాలు సాగించే మహిళలకు “జమాత్ ఉల్ మోమినత్ ” అనే పేరు పెట్టారు. ఈ దళానికి జైష్ అధినేత మసూద్ సోదరి సాదియా అజర్ నాయకత్వం వహిస్తోంది. ఇప్పటికే ఈ దళంలో ఉగ్రవాదుల భార్యలు చాలామంది చేరిపోయారు. వీరంతా కూడా ఆత్మాహుతి దాడులకు నేతృత్వం వహించే దిశగా శిక్షణ పొందినట్టు తెలుస్తోంది. వీరు ఇతర మహిళలకు కూడా శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత దళాలు పాకిస్థాన్లో జైష్ ఉగ్రవాద సంస్థ కార్యాలయాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో సాదియా భర్తకు కన్నుమూశాడు. అప్పటినుంచి ఆమె భారత్ మీద తీవ్రస్థాయిలో ద్వేషం పెంచుకుంది. అందువల్లే పేద మహిళలను తన బృందంలో చేర్చుకుంటున్నది.
పాకిస్తాన్లోని బహవల్పూర్, కరాచీ, హరీ పూర్, ముజఫర్బాద్, కోట్లి, మాన్సిరా వంటి ప్రాంతాలలో ఉన్న మహిళలను తన బృందంలోకి చేర్చుకుంటున్నది. సోషల్ మీడియా, వాట్సప్, ఇతర మార్గాల ద్వారా రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. జమ్ము కాశ్మీర్, యూపీలో ఉన్న పేద ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకొని తన ఉగ్రవాద దళంలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఫరీదాబాద్ ప్రాంతంలో పోలీసులకు చిక్కిన ఇద్దరు మహిళ ఉగ్రవాద డాక్టర్లు ఈమె దళానికి చెందిన వారిని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాలకు పూర్తిస్థాయిలో సమాచారం ఉండడంతో మహిళా ఉగ్రవాదులపై కన్నేసినట్టు తెలుస్తోంది.