KCR vs BJP: ఏకుమేకవుతున్న బీజేపీ.. కేసీఆర్ లో అందుకేనా ఫస్ట్రేషన్?

KCR vs BJP: ‘మెడలు వంచుడు కాదు.. విరిచేస్తానని’ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాట చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ అధినేతలో మునుపు ఎన్నడూ లేనంతా ఫస్ట్రేషన్ నిన్న వచ్చేసింది. కోపాన్ని అణుచుకోలేక కేసీఆర్ చీల్చిచెండాడేశాడు.. ప్రతీసారి విమర్శల్లో భాగంగా కేసీఆర్ ను జైలుకు పంపుతానని బండి సంజయ్ అంటుంటారు. ఇప్పుడు దాన్ని కూడా కేసీఆర్ సవాల్ చేయడం విశేషం. ‘దమ్ముంటే టచ్ చేయి’ అంటూ అగ్గి రాజేశారు.దీన్ని బట్టి […]

Written By: NARESH, Updated On : November 8, 2021 8:21 am
Follow us on

KCR vs BJP: ‘మెడలు వంచుడు కాదు.. విరిచేస్తానని’ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాట చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ అధినేతలో మునుపు ఎన్నడూ లేనంతా ఫస్ట్రేషన్ నిన్న వచ్చేసింది. కోపాన్ని అణుచుకోలేక కేసీఆర్ చీల్చిచెండాడేశాడు..

ప్రతీసారి విమర్శల్లో భాగంగా కేసీఆర్ ను జైలుకు పంపుతానని బండి సంజయ్ అంటుంటారు. ఇప్పుడు దాన్ని కూడా కేసీఆర్ సవాల్ చేయడం విశేషం. ‘దమ్ముంటే టచ్ చేయి’ అంటూ అగ్గి రాజేశారు.దీన్ని బట్టి కేసీఆర్ ఇక బీజేపీని లైట్ తీసుకోవడం లేదని.. ఎంతమాత్రం బీజేపీ నేతలను వదల వద్దని డిసైడ్ అయ్యాడు.

బండి సంజయ్ నే కాదు.. కేంద్రం తీరును.. దేశ రాజకీయాల్లో ఆ పార్టీ వ్యవహరిస్తున్న వైఖరిని.. కర్ణాటక సహా పక్క రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పనితీరును కేసీఆర్ ఎండగట్టేశారు. ఎక్కడెక్కడివో లాగి మరీ బీజేపీని టార్గెట్ చేశారు.

కేసీఆర్ లో ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరిందని అర్థమైంది. ఆయన బాధల్లా హుజూరాబాద్ లో ఎంత ఖర్చు పెట్టినా కోట్లు కుమ్మరించినా.. దళితబంధుతో రూ.10లక్షలు సాయం చేసినా తన ప్రత్యర్థి అయిన ఈటల రాజేందర్ గెలవడమే కాదు.. ఈటల గెలుపును కేసీఆర్ జీర్ణించుకోవడం లేదని అర్థమైంది. ఆ ఆవేదన ఆగ్రహంలోంచే ఈ మాటలు వచ్చాయని అర్థమవుతోంది.

తెలంగాణలో ఇప్పుడు బీజేపీ ఏకు మేకు అవుతోంది. చిన్నగా మొదలైన బీజేపీ ఇప్పుడు దిగ్గజ నేతల చేరికతో బలోపేతమవుతోంది. కేంద్రం సపోర్టు.. టీఆర్ఎస్ వ్యతిరేకులంతా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ ను మాత్రమే బలమైన ప్రతిపక్షంగా భావించిన కేసీఆర్ ఇప్పుడు తన కాళ్లకిందకు నీళ్లు తెస్తున్న బీజేపీని ఎంతమాత్రం వదిలిపెట్టకూడదని డిసైడ్ అయ్యాడు. అందుకే ఎదురుదాడి చేసినట్టుగా అర్థమవుతోంది.